అన్వేషించండి

Eagle: సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనున్న ‘ఈగల్’? నాగార్జునే కారణమా?

Eagle Movie: రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీ ముందుగా సంక్రాంతికి థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధమయ్యింది. కానీ పోటీ వల్ల తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ‘ఈగల్’ తప్పుకొని ‘నా సామిరంగ’కు సాయం చేయనుంది.

Eagle Movie Postponed: 2024 సంక్రాంతికి  సినిమాల మధ్య గట్టి పోటీనే జరగనుంది. ఇప్పటికే అయిదు తెలుగు సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా.. రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా వీటితో పోటీపడడానికి ముందుకొచ్చాయి. ఇక ఇన్ని సినిమాలకు ఒకేసారి థియేటర్లు దొరకడం కష్టం కాబట్టి మేకర్స్ అంతా అయోమయంలో పడ్డారు. కొందరు అయితే ఈ పోటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. అందులో ముందుగా రవితేజ ‘ఈగల్’ ఉండనుంది. రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అంత పోటీ మధ్య విడుదల చేయడంకంటే తప్పుకోవడం బెటర్ అని మూవీ టీమ్ ఆలోచనలో పడిందట.

త్వరలోనే అధికారిక ప్రకటన..
ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాల్లో ‘గుంటూరు కారం’కే ఎక్కువగా థియేటర్లు లభించాయి. పైగా మిగతా చిత్రాలతో పోలిస్తే.. మహేశ్ మూవీకే ఎక్కువగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మిగతా మేకర్స్ అంతా ఆందోళనలో పడ్డారు. పోటీ లేని సమయంలో విడుదల చేస్తే.. మూవీ యావరేజ్‌గా ఉన్నా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అంత పోటీ మధ్య మంచి టాక్ రావడం మాత్రమే కాదు.. విడుదల చేయడం కూడా కష్టంగానే మారుతుంది. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ‘ఈగల్’ను పోస్ట్‌పోన్ చేయాలనుకుందట మూవీ టీమ్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

నాగార్జునకు సాయంగా..
సంక్రాంతి బరిలో ఎవరు విన్నర్ అని తెలిసిన తర్వాత జనవరి 26న పెద్దగా సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడంతో ‘ఈగల్’ను అదే రోజు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే ముందుగా జనవరి 13న ఈ మూవీని విడుదల చేయాలని అనుకున్నారు కాబట్టి ఇప్పటికే కొన్ని థియేటర్లు ‘ఈగల్’ షో వేయడానికి బుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్‌పోన్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ థియేటర్లను నాగార్జున నటించిన ‘నా సామిరంగ’కు త్యాగం చేయాలని అనుకుంటున్నారట. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ కూడా ఈ సంక్రాంతికే విడుదల కానుండగా.. మిగతా సినిమాలతో పోలిస్తే.. ఈ చిత్రానికి కాస్త తక్కువ థియేటర్లే దొరికాయి. అందుకే ‘ఈగల్’ షో వేయాలనుకున్న థియేటర్లలో ఇప్పుడు ‘నా సామిరంగ’ బొమ్మపడనుంది.

మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడిగా..
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘ఈగల్’లో రవితేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ‘ధమాకా’ అనే చిత్రాన్ని చేశాడు రవితేజ. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రానున్న రెండో చిత్రమే ‘ఈగల్’. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేని.. ‘సూర్య వర్సెస్ సూర్య’తో డైరెక్టర్‌గా మారాడు. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ సినిమాటోగ్రాఫీతోనే బిజీ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజను హీరోగా పెట్టి ‘ఈగల్’ను తెరకెక్కించాడు. ఇప్పటికే ‘ఈగల్’ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also Read: ‘సైంధవ్’ ట్రైలర్‌లో బులెట్ షాట్‌పై ట్రోల్స్ - వివరణ ఇచ్చిన డైరెక్టర్ శైలేష్

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget