Mass Jathara Release Date: వినాయక చవితికి 'మాస్ జాతరే' - మాస్ మహారాజ్‌తో కలిసి గణేష్ ఉత్సవ్
Raviteja: ఈ వినాయక చవితికి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తోంది. మాస్ మహారాజ్ లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ 'మాస్ జాతర' రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Raviteja's Mass Jathara Release Date: మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ అవెయిటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మూవీ టీం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.
వినాయక చవితికి..
ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యేలా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. 'ఈసారి గణేష్ ఉత్సవం థియేటర్స్‌లో జరుపుకొందాం.' అని మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండడం మరింత హైప్ తీసుకొచ్చింది.
ట్రెండింగ్ లో తు మేరా లవర్
ఇటీవల మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'తు మేరా లవర్' రిలీజ్ అయి ట్రండింగ్‌లో నిలిచింది. రవితేజ, శ్రీలీల ఫుల్ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు. అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసిన 'ఇడియట్' సినిమాలో 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' సాంగ్‌కు రీమిక్స్‌గా వచ్చిన పాట మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
It’s an official declaration of a 𝙈𝘼𝙎𝙎 𝙀𝙉𝙏𝙀𝙍𝙏𝘼𝙄𝙉𝙄𝙉𝙂 𝘽𝙊𝙉𝘼𝙉𝙕𝘼 this festive season 📢🔥
— Sithara Entertainments (@SitharaEnts) May 29, 2025
Mass Maharaaj @RaviTeja_offl is bringing a Full On Cracker of a show this Ganesh Chaturthi - AUGUST 27th 💥💥
ఈసారి పండక్కి సౌండ్ మామూలగుండదు….🥁🥁… pic.twitter.com/D7K2cosvCu
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ వినాయక చవితికి 'మాస్ జాతర' చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
'ధమాకా' వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తోన్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. కొద్ది రోజులుగా రవితేజ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఆయన హీరోగా నటించిన లాస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో మాస్ మహారాజ్ మళ్లీ కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అటు.. శ్రీలీల లాస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' కూడా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 'ధమాకా' మూవీ రిజల్ట్ కూడా ఈ మూవీకి రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక రవితేజ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. కల్యాణ్ శంకర్ మూవీతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇదో ఫాంటసీ జానర్‌లోనే ఉంటుందని.. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ కాదని డైరెక్టర్ తెలిపారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.



















