Ravi Teja New Movie: వచ్చే సంక్రాంతికి రవన్న కామెడీ దావత్ ఇస్తుండు - రెడీ అయిపోండ్రి, ఇక ధూమ్ ధామ్ జాతరే
Ravi Teja Bhanu Bogavarapu movie announced: 'సామజవరగమన' రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ... మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న సినిమాను ఉగాది సందర్భంగా వెల్లడించారు.
Ravi Teja 75th movie in Bhanu Bogavarapu direction announced: కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ ముందు ఉంటారు. బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, కెఎస్ రవీంద్ర (బాబీ), శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని వంటి దర్శకులను పరిచయం చేసింది ఆయనే. ఇప్పుడు మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.
శ్రీ విష్ణు 'సామజవరగమన'తో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న యువకుడు భాను భోగవరపు. ఆ సినిమాకు ముందు సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ', సత్య 'వివాహ భోజనంబు' సినిమాలకు రచయితగా పని చేశారు. ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు రవితేజ.
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోగా రవితేజ 75వ చిత్రమిది. ఉగాది సందర్భంగా ఈ రోజు సినిమాతో పాటు రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు.
2025 సంక్రాంతికి రవితేజ ధూమ్ ధామ్!
Ravi Teja Anudeep KV movie to release on Sankranti 2025: రవితేజ, భాను భోగవరపు కలయికలో సినిమా చేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు ఇవాళ వెల్లడించాయి. అంతే కాదు... వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ రోజు తెలిపాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
Also Read: మెగా లీక్స్... తమ్ముడొచ్చిన ఆనందంలో గట్లా చేస్తే ఎట్లా?
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు... రెడీ అయిపొండ్రి 🥳
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO
హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్!
భాను భోగవరపు రచయితగా పని చేసిన సినిమాల తరహాలో రవితేజ సినిమా కూడా వినోదాత్మకంగా ఉంటుందట. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. రవితేజ ఇమేజ్, ఆయన కామెడీ టైమింగ్ దృష్టిలో పెట్టుకుని మంచి ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్ రెడీ చేశారట భాను భోగవరపు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించనున్నారు. 'ధమాకా'కు ఆయన ఇచ్చిన సాంగ్స్ ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. టిపికల్ మాస్ మహారాజా ఎనర్జీ, డ్యాన్స్ నంబర్స్, కామెడీని మళ్లీ థియేటర్లలోకి తీసుకు వస్తామని చెబుతూ సినిమాపై అంచనాలు పెంచేసింది సితార సంస్థ.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
భీమ్లా నాయక్ అనుకున్నా... ఇప్పటికి కుదిరింది!
రవితేజ, రానా హీరోలుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ గతంలో 'భీమ్లా నాయక్' చేయాలని ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ మలయాళ సినిమా 'అయ్యపనుమ్ కోషియుమ్' చూసి తాను రీమేక్ చేస్తానని అనుకోవడంతో అప్పుడు కాంబినేషన్ కుదరలేదు. ఇప్పుడు రవితేజ, సితార కలయికలో సినిమాను ప్రకటించారు.
ప్రస్తుతం రవితేజ 'బచ్చన్ సాబ్' సినిమా చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?