Raveena Tandon: ఆ పాట వల్ల టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది: షూటింగ్ సమయంలో కష్టాలు గుర్తుచేసుకున్న రవీనా
1994లో విడుదలయిన చిత్రం ‘మోహ్రా’. ఈ మూవీ విడుదలయ్యి ఇప్పటికీ 29 ఏళ్లు అయ్యింది. అయినా కూడా అందులోని ‘టిప్ టిప్ భర్సా పానీ’ పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ప్రేక్షకులు అనేవారు కేవలం స్క్రీన్‌పై కనిపించే దృశ్యాన్ని మాత్రమే చూడగలుగుతారు. కానీ ఆ దృశ్యాన్ని క్రియేట్ చేయడం కోసం దాని వెనుక ఎంతమంది, ఎంత కష్టపడతారు అనే విషయాన్ని చాలామంది ప్రేక్షకులు ఆలోచించరు. స్క్రీన్‌పై ఒక రెయిన్ సాంగ్ చూసినప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. కానీ ఆ రెయిన్ సాంగ్ చిత్రీకరించడానికి మేకర్స్ మాత్రమే కాదు.. హీరో, హీరోయిన్స్ కూడా చాలా కష్టపడతారు. బాలీవుడ్ హిస్టరీలోనే ‘టిప్ టిప్ భర్సా పానీ’ అనే రెయిన్ సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఆ సాంగ్ విశేషాల గురించి, షూటింగ్ అప్పుడు తాను పడిన కష్టాల గురించి రవీనా టాండన్ తాజాగా బయటపెట్టారు.
29 ఏళ్లు అయినా..
1994లో విడుదలయిన చిత్రం ‘మోహ్రా’. ఈ మూవీ విడుదలయ్యి ఇప్పటికీ 29 ఏళ్లు అయ్యింది. అయినా కూడా అందులోని ‘టిప్ టిప్ భర్సా పానీ’ పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏ పార్టీ ప్లేస్‌లో అయినా ఆ పాట వినిపించాల్సిందే. ఆ సాంగ్‌లో రవీనా అందచెందాలకు అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పటి యూత్ కూడా ఫిదా అయిపోతారు. ఇది చూస్తున్న ప్రతీసారి చాలామంది అమ్మాయిలు తాము కూడా చీర కట్టుకొని ఈ పాటపై డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకోకుండా ఉండలేరు.
‘టిప్ టిప్’ విశేషాలు..
రవీనా.. ‘టిప్ టిప్’ పాట విశేషాలను, చీరతో అలాంటి ఒక పాట చిత్రీకరణ ఎలా జరిగింది అనే విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. రవీనా గెస్ట్‌గా వెళ్లిన రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్.. ‘టిప్ టిప్ భర్సా పానీ’ పాటకు పర్ఫార్మ్ చేశారు. దీంతో అలనాటి విషయాలు రవీనాకు గుర్తొచ్చాయి. ఆ పాట ఒక నిర్మాణం జరుపుకుంటున్న బిల్డింగ్‌లో జరిగిందని, నిర్మాణం జరగుతుంది కాబట్టి ఆ సమయంలో అక్కడ అన్ని మేకులు ఉన్నాయని రవీనా చెప్పుకొచ్చింది. చెప్పులు లేకుండా అలాంటి ఒక ప్రాంతంలో సాంగ్ షూట్ చేయడం చాలా అసౌకర్యంగా ఉందని రవీనా తెలిపింది. ‘అదే సమయంలో నేను టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. వర్షంలో పదే పదే తడిచినందుకు ఆరోగ్యం దెబ్బతిన్నది. మీరు స్క్రీన్‌పై చూసే గ్లామర్ వెనుక మీకు తెలియని ఎన్నో కథలు ఉంటాయి. రిహార్సెల్స్ సమయంలో ఎన్నో గాయాలు అవుతాయి. కానీ మేము అవన్నీ పట్టించుకోము. స్టేజ్‌పైన కానీ, స్క్రీన్ మీద కానీ ఇలాంటివి తప్పవు. పట్టించుకోకుండా ముందుకు వెళ్లాల్సిందే. అలాంటి సమయాల్లో నొప్పి వల్ల ఎక్స్‌ప్రెషన్ కానీ, నవ్వు కానీ చెదిరిపోకూడదు. ఇలాంటి కష్టాలనే స్క్రీన్ వెనుక ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు అనుభవిస్తూ ఉంటారు.’ అని రవీనా టాండన్ తెలిపింది.
‘కేజీఎఫ్ 2’తో మళ్లీ ఫార్మ్‌లోకి..
హీరోయిన్‌గా రవీనా టాండన్ కెరీర్‌లో ‘టిప్ టిప్’ లాంటి పాటలు, బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అప్పట్లో రవీనాకు ఒక రేంజ్‌లో క్రేజ్ ఉండేది. హాలీవుడ్ స్టార్లు సైతం రవీనాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించేవారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా రవీనా టాండన్ ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’లో రవీనా చేసిన పాత్రతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ‘వెల్‌కమ్ టు జంగిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, అర్షద్ పటేల్, పరేశ్ రావల్ లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ చేసుకోనుంది. చాలాకాలం తర్వాత ‘వెల్‌కమ్ టు జంగిల్’ కోసం అక్షయ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది రవీనా టాండన్. అప్పట్లో అక్షయ్ కుమార్, రవీనా టాండన్‌కు ఉన్న క్రేజ్.. ఇప్పుడు ఈ మూవీకి సహాయపడుతుందని మేకర్స్ అనుకుంటున్నారు.
Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఫస్ట్ ఎలిమినేషన్ - హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్!‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఫస్ట్ ఎలిమినేషన్ - హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial