అయితే ఆలోచించాల్సిందే - ఆ రూమర్‌పై ఘాటుగా స్పందించిన రష్మిక
Rashmika Mandanna: ఈ మధ్య స్టార్ హీరోయిన్ రష్మిక ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఆ మధ్య డీప్ ఫేక్ వీడియోతో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత యానిమల్ మూవీ హిట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.
Rashmika React on Rumours: ఈ మధ్య స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఆ మధ్య డీప్ ఫేక్ వీడియోతో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత యానిమల్ మూవీ హిట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లవ్ ఎఫైర్ రూమర్‌తో తరచూ మీడియాకు ఎక్కుతుంది. ఇలా మంచో చేడో రష్మిక గురించి ఎదోక విధంగా చర్చ, రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే యానిమల్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రష్మికపై తాజాగా ఓ రూమర్ పుట్టుకొచ్చింది. మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడు భారీగా రెమ్యునరేషన్ పెంచిందట.
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యింది. దీనిపై నెట్టింట ఫుల్ చర్చ జరుగుతుంది. యానిమల్ భారీ విజయం సాధించడంతో రష్మిక రూ 4 కోట్ల నుంచి రూ 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందంటూ దీనిపై రెండు రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకు ముందు వరకు రష్మిక రూ. 2.5 నుంచి రూ. ౩ కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేదట. అదీ కూడా పాన్ ఇండియా మూవీ పుష్ప హిట్‌తో పెంచినట్టు సమాచారం. అంతలోనే ఇంత పారితోషికం డిమాండ్ చేయడమేంటని అంతా మాట్లాడుకుంటున్నారు. అందుకు ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. ఇది కాస్తా వైరల్ కావడంతో రష్మిక కంట పడింది. ఇక దీనికి తనదైన స్టైల్లో స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది.
మీరు చెప్పినట్టే చేస్తా..
"ఆశ్చర్యంగా ఉంది.. ఇది మీకు ఎవరూ చెప్పారు. ఇది చూశాక నిజంగానే దీనిపై ఆలోచించాలి అనుకుంటున్నా. మీరు చెప్పినట్టుగానే నిర్మాతలను ఇకపై అదే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాను. ఒకవేళ వారు ఎందికిలా అని ప్రశ్నిస్తే మాత్రం మీ పేరే చెబుతాను. మీడియా ఇంత రెమ్యునరేషన్ అంటూ చెప్పిందని, వారి మాటలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను.. నేనేం చేస్తా అని చెబుతా" అంటూ ఈ రూమర్ పై సటైరికల్‌గా స్పందించింది. దీంతో రష్మిక రెమ్యునరేషన్ వదంతులకు ఇలా చెక్ పడింది. దీంతో ఆమె పారితోషికం పెంచలేదనేది క్లారిటీ వచ్చేసింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప పార్ట్ 2తో బిజీగా ఉంది. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుటుంది. దీనితో పాటు ‘రెయిన్బో’, ‘గర్ల్‌ఫ్రెండ్’లాంటి మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ‘చావ’ అనే హిందీ మూవీలో కూడా రష్మిక నటిస్తోంది.
Says who I wonder 🤦🏻♀️.. after seeing all of this I think I should actually consider it.. and if my producers ask why.. then I’ll just say ‘media out there is saying this sir.. and I think I should live up to their words.. what do I do?’ 🤣🤦🏻♀️
— Rashmika Mandanna (@iamRashmika) February 6, 2024
పూాజాలా అయిపోతావు జాగ్రత్త..
ఇదిలా ఉంటే రష్మిక రెమ్యునరేషన్ పెంచిందని వినగానే నెటిజన్లంతా పూజా హెగ్డే, అనుష్క, సమంతలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అంతా పూజ హెగ్డేను చూపిస్తూ ఆమెలా అయిపోతావంటూ రష్మికు హెచ్చరించారు. రష్మిక కంటే ముందు కొందరు హీరోయిన్లు కూడా ఇలాగే రెమ్యునరేషన్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని చేతికి వచ్చిన ఆఫర్లను పోగొట్టుకుందని అంటున్నారు. ఒకప్పుడు పూజా హెగ్డే కూడా భారీ రెమ్యునరేషన్‌తో, అంతులేని డిమాండ్స్‌తో మేకర్స్‌ను ఇబ్బంది పెట్టడంతో ప్రస్తుతం తన చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఇక ‘యానిమల్’ తెచ్చిపెట్టిన క్రేజ్ చూసి రష్మిక కూడా అదే బాటలో వెళ్తే.. చివరికి తన పరిస్థితి కూడా అదే అని నెటిజన్లు భావించారు.