News
News
X

Rao Ramesh As Hero : హీరోగా రావు రమేష్ - సినిమా అనౌన్స్ చేశారోచ్

Maruthi Nagar Subrahmanyam Movie Rao Ramesh : రావు రమేష్ కథానాయకుడిగా ఈ రోజు ఓ సినిమా అనౌన్స్ చేశారు. దీనికి 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్ష్మణ్ కార్య దర్శకుడు.

FOLLOW US: 
Share:

క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారి సినిమాలు చేయడం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా అరుదు. వాళ్ళకు సరిపడా కథలు దొరకడమూ అరుదు. అందువల్ల, తెలుగులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువ వస్తాయి. అసలు, కథానాయకుడు అంటే ఏమిటి? కథలో ముందుండి, కథను ముందుకు నడిపించే నాయకుడు అని! ఇప్పుడు అటువంటి నాయకుడిగా విలక్షణ నటుడు రావు రమేష్  (Rao Ramesh) ఓ సినిమా చేయబోతున్నారు. ఆయన హీరోగా మారుతున్నారు.

హీరోగా రావు రమేష్
రావు రమేష్ కథానాయకుడిగా నటించనున్న చిత్రం 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' (Maruthi Nagar Subrahmanyam Movie). పీబీఆర్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా తెరకెక్కుతోంది. ఇందులో సీనియర్ కథానాయిక, నటి ఇంద్రజ కీలక పాత్ర పోషించనున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ 'పుష్ప', 'కెజియఫ్', 'ధమాకా' తర్వాత రావు రమేష్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో ఆయన టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ రోజు సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కథ ఎలా ఉంటుందేంటి?
రావు రమేష్ క్యారెక్టర్ ఏంటి?
'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'గా రావు రమేష్ చేయనున్న క్యారెక్టర్ రెగ్యులర్ హీరో రోల్ కాదని చిత్ర బృందం తెలిపింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొంది. రావు రమేష్ క్యారెక్టర్ గురించి దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ ''నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగిగా రావు రమేష్ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు'' అని అన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన  తెలిపారు. 

మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్
మార్చి నుంచి 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమా రెగ్యులర్ షూటింగ్ సార్ట్ చేస్తామని పీబీఆర్ సినిమాస్ సంస్థ తెలియజేసింది. హిందీ చిత్రసీమలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా కరోనా కాలంలో ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. అందువల్ల, రావు రమేష్ అండ్ టీమ్ ఈ సినిమా చేయడానికి ముందడుగు వేశారని అనుకోవచ్చు.

Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి 

Rao Ramesh Indraja Movie : లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాలో ఇంద్రజ నటించారు. అతనితో మరోసారి పని చేస్తున్నారు. రావు రమేష్, ఇంద్రజ ఇంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించినా... ఫుల్ లెంగ్త్ కాంబినేషన్, రోల్స్ చేయలేదు. వాళ్ళ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. 

Also Read : పాపం ఊర్వశి, రిషబ్ పేరుతో ఆమెకు ఎన్ని తిప్పలో!? మళ్ళీ ట్రోలింగ్ షురూ

Published at : 24 Feb 2023 10:16 AM (IST) Tags: Rao Ramesh Maruthi Nagar Subrahmanyam Movie Director Lakshman Karya Actress Indraja

సంబంధిత కథనాలు

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు