అన్వేషించండి

Naga Bandham Ticket Offer : రావు బహదూర్ Vs నాగబంధం - టికెట్ రేట్స్ To వన్ ప్లస్ వన్ ఆఫర్... ఆడియన్స్‌కు మేకర్స్ బిగ్ ఆఫర్

Rao Bahadur Ticket Prices : సత్యదేవ్ రావు బహదూర్‌తో పాటు విరాట్ కర్ణ నాగబంధం వరకూ మూవీస్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు.

Rao Bahadur Naga Bandham Makers Offers Low Ticket Prices : శుక్రవారం సరికొత్త మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. సత్యదేవ్ హీరోగా నటించిన సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా రావు బహదూర్, యంగ్ హీరో విరాట్ కర్ణ నటించిన మైథలాజికల్ ఎపిక్ విజవల్ వండర్ 'నాగబంధం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆడియన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తక్కువ ధరలకే టికెట్ రేట్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

రావు బహదూర్ టికెట్ రేట్స్

రావు బహదూర్ మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ నిర్ణయించినట్లు చెప్పారు మేకర్స్. ప్రాంతాల వారీగా టికెట్ రేట్స్ చూస్తే... సింగిల్ స్క్రీన్స్ విషయానికొస్తే... నైజాంలో రూ.150, ఆంధ్రా ఏరియాలో రూ.145, సీడెడ్‌లో కేవలం రూ.100 గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక, తెలంగాణలోని అన్నీ మల్టీఫ్లెక్సుల్లో టికెట్ ధర రూ.200గా నిర్ణయిస్తే... ఏపీలో రూ.177కే ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. 

చాలా రోజుల తర్వాత సత్యదేవ్ డిఫరెంట్ రోల్స్‌లో నటించిన మూవీ రావు బహదూర్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండడం మరో స్పెషల్ అట్రాక్షన్. కేరాఫ్ కంచరపాలెం ఫేం వెంకటేశ్ మహా ఈ  సినిమాకు దర్శకత్వం వహించగా... సత్యదేవ్‌తో పాటు దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Also Read : Super Subbu Web Series Review - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?

నాగబంధం వన్ ప్లస్ వన్ ఆఫర్

విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా రేంజ్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నాగబంధం'. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టికెట్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో ఉండేలా సింగిల్ స్క్రీన్స్‌లో రూ.150 నుంచి రూ.250 వరకూ ఉండగా... మల్టీ ప్లెక్సుల్లో టికెట్ రేట్స్ దాదాపు రూ.295 వరకూ ఉన్నాయి.

హిందీ వెర్షన్ కోసం స్పెషల్ ఆఫర్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా... హిందీ వెర్షన్ కోసం టికెట్స్ బుక్ చేసుకుంటే ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా లభిస్తుంది.

ఈ సినిమాలో శివునిగా విరాట్ కర్ణ నటిస్తుండగా... నభా నటేష్ పార్వతి పాత్రలో నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటే జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, మహేశ్ మంజ్రేకర్, గరుడ రామ్, జయ ప్రకాష్, మురళీ శర్మ, బీఎన్ అవినాష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించారు.

Also Read : Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget