Ranveer Singh Prasanth Varma: ప్రశాంత్ వర్మతో రణవీర్ సినిమా లేదు - వాళ్లిద్దరూ అఫీషియల్‌గా చెప్పేశారు
Prasanth Varma On Ranveer Singh Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలయికలో సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు.
![Ranveer Singh Prasanth Varma: ప్రశాంత్ వర్మతో రణవీర్ సినిమా లేదు - వాళ్లిద్దరూ అఫీషియల్‌గా చెప్పేశారు Ranveer Singh Rakshas movie with HanuMan director Prasanth Varma shelved makers released official statement Ranveer Singh Prasanth Varma: ప్రశాంత్ వర్మతో రణవీర్ సినిమా లేదు - వాళ్లిద్దరూ అఫీషియల్‌గా చెప్పేశారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/783de3943c78aa6bfb17c1feaea8db8a1717049627174313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒక్క సినిమా... 'హనుమాన్' అనే సినిమా... మన టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సత్తా ఏమిటనేది పాన్ ఇండియా బాక్సాఫీస్ అంతటికీ బలంగా చెప్పింది. 'హనుమాన్' విజయం తర్వాత ఆయన దర్శకత్వంలో నటించడానికి, ఓ సినిమా చేయడానికి సౌత్ స్టార్లు మాత్రమే కాదు... బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపించారు. అందులో రణవీర్ సింగ్ ఒకరు. ఆయనతో ప్రశాంత్ వర్మ 'రాక్షస' అని ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, ప్రస్తుతానికి ఆ సినిమా పక్కన పెట్టినట్లు హీరోతో పాటు దర్శకుడు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయా?
హీరో, దర్శకుడు ఏమన్నారంటే?
రణవీర్ సింగ్ (Ranveer Singh), ప్రశాంత్ వర్మ సినిమా గురించి కొన్ని రోజులుగా మీడియాలో పలు కథనాలు షికారు చేశాయి. అందులో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం కారణంగా సినిమా ఆగిందనేది ప్రధానమైన విమర్శ. పలు పుకార్లు షికారు చేస్తుండటంతో వాటికి చిత్ర బృందం చెక్ పెట్టె ప్రయత్నం చేసింది.
భవిష్యత్తులో మేం కలిసి సినిమా చేయవచ్చు - రణవీర్, ప్రశాంత్!రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి సన్నాహాలు చేశారు. ఆ చిత్రానికి 'రాక్షస' టైటిల్ కూడా అనుకున్నారు. పుకార్లు వచ్చిన నేపథ్యంలో హీరో, దర్శకుడితో కలిసి నిర్మాణ సంస్థతో కలిసి ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సినిమా చేయడానికి ఇది సరైన సమయం కాదని భావించడంతో తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు తెలిపింది.
''ప్రశాంత్ వర్మలో స్పెషల్ టాలెంట్ ఉంది. మేం ఇద్దరం కలిశాం. ఓ సినిమా ప్లాన్ చేశాం. ఐడియా కూడా అనుకున్నాం. భవిష్యత్తులో ఎగ్జైటింగ్ సినిమా కోసం మేం కలిసి పని చేయవచ్చు'' అని రణవీర్ సింగ్ తెలిపారు. ''రణవీర్ సింగ్ లాంటి ప్రతిభవంతుడైన నటుడు, ఎనర్జీ కల వ్యక్తి అరుదుగా మనకు తారసపడతారు. భవిష్యత్తులో మేం కలిసి పని చేస్తాం'' అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. తాము భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేస్తామని ఈ చిత్ర బృందం ప్రామిస్ చేసింది.
Also Read: సుక్కుతో స్టెప్పులు వేయించిన డ్యాన్స్ మాస్టర్ - ఈ లిరికల్ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా?
An official statement from the team about #RanveerSingh’s Project with #PrasanthVarma and #MythriMovieMakers!!
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 30, 2024
In a mutual understanding, the team decided to part ways with a possible collaboration in future. @RanveerOfficial @PrasanthVarma @MythriOfficial pic.twitter.com/3XJBGzKIUf
ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఏంటి?
Prasanth Varma next movie after Hanuman: రణవీర్ సింగ్ హీరోగా అనుకున్న 'రాక్షస' ఆగడంతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఏంటి? అనే ఆసక్తి మొదలు అయ్యింది. 'హనుమాన్' తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది? అని పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' అనౌన్స్ చేశారు. కానీ, ఇంకా క్యాస్టింగ్ కంప్లీట్ కాలేదు. 'హనుమాన్'కు ముందు అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ ఒక సినిమా స్టార్ట్ చేశారు. అదీ విడుదల చేయాల్సి ఉంది.
Also Read: ఇక 'ఎక్స్ట్రా'ల్లేవ్... జస్ట్ 'జబర్దస్త్'... స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)