అన్వేషించండి

Dhurandhar 2 Collection : 1800 కోట్లకు చేరువలో ధురంధర్ 2 - 'బాహుబలి 2' రికార్డ్ సేఫ్...

Dhurandhar 2 Record Collections : రణవీర్ సింగ్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 32 రోజులకు రూ.1,750 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

Ranveer Singh's Dhurandhar 2 Box Office Collections : బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2 : ది రివేంజ్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దాదాపు 6 వారాలు దగ్గర పడుతున్నా అంతే జోష్ కలెక్షన్స్‌తో కంటిన్యూ అవుతోంది. 

రూ.1,800 కోట్లకు చేరువలో...

వరల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ పరంగా రూ.1,800 కోట్లకు చేరువలో 'ధురంధర్ 2' ఉంది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,783 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇండియావ్యాప్తంగా రూ.1,360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా... రూ.1,153 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అటు, ఓవర్సీస్‌లో రూ.423 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ మూవీస్ రికార్డులను చెరిపేసింది. ఈ జోష్ ఇలాగే కంటిన్యూ అవుతుందని... లాంగ్ రన్‌లో రూ.2,500 కోట్లను టచ్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jio Studios (@officialjiostudios)

Also Read : అల్లు అర్జున్ రెమ్యునరేషన్... 30 పైసలే! - ప్రొడ్యూసర్‌కు రిలీఫ్ ఇచ్చేలా న్యూ స్ట్రాటజీ... ఎన్ని కోట్లో తెలుసా?

పుష్ప 2 రికార్డు బ్రేక్

ధురంధర్ 2 ఇప్పటికే పుష్ప 2 రికార్డును బ్రేక్ చేయగా... బాహుబలి 2 రికార్డు మాత్రం అలానే ఉంది.  అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ రూ.1,742 కోట్లు సాధించిన 'పుష్ప 2'ను రూ.1,783 కోట్లతో అధిగమించింది. ఇక ఫస్ట్ ప్లేస్‌లో దంగల్ (రూ.2,090 కోట్లు), సెకండ్ ప్లేస్‌లో బాహుబలి 2 (రూ.1,788 కోట్లు) ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే బీట్ చేస్తుందని సినీ వర్గాల అంచనా.

రూ.3 వేల కోట్ల క్లబ్‌లో 'ధురంధర్' ఫ్రాంచైజీ

ఇక, ధురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో రూ.3 వేల కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. రెండు భాగాలు కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.3,100 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. బాహుబలి సిరీస్, పుష్ప సిరీస్‌లపై ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఈ స్థాయిలో మార్క్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అటు, బాలీవుడ్ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. 30 రోజులు దాటినా అంతే స్థాయిలో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేస్తుండడంతో ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 

ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్‌కు రెస్పాన్స్ వస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Dil Raju vs Mythri: 'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు
'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు
Seat Edge Horror Thriller OTT : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - సీట్ ఎడ్జ్ మూవీ రియల్లీ డోంట్ మిస్
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - సీట్ ఎడ్జ్ మూవీ రియల్లీ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Sweet Cravings During Weight Loss : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి
బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
Embed widget