News
News
X

Rana Daggubati Health: ఆ బాధ అలాగే ఉంది, ధైర్యమే కాపాడింది - రానా ఎమోషనల్ కామెంట్స్

ఇటీవల రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థతి గురించి బయటపెట్టారు. తాను కన్ను, కిడ్నీ సమస్యలతో భాదపడ్డానని చెప్పుకొచ్చారు. 

FOLLOW US: 
Share:

రానా దగ్గుబాటి.. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. కెరీర్ మొదట్నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుసుకున్నారు. ఇక ‘బాహుబలి’ లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి బయటపెట్టారు. తాను కన్ను, కిడ్నీ సమస్యలతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. 

రానా మాట్లాడుతూ.. గతంలో తాను కుడి, కిడ్నీ ఆపరేషన్ లు చేయించుకున్నానని చెప్పారు. చిన్ననాటి నుంచి కుడి కన్ను నుంచి చూడలేనని, అందుకే కుడి కన్నుకు ఆపరేషన్ చేశారని తెలిపారు. కొన్నాళ్ల క్రితం కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రావడంతో చివరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. చాలా మంది శారీరక సమస్యల కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారని, కొన్నాళ్లకు ఆ సమస్య పరిష్కరించినప్పటికీ కొంత బాధ మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. అయితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తాను ధైర్యంగా ఉన్నానని అదే చాలా వరకూ తనను కాపాడిందని అన్నారు. 

గతంలో నటి సమంత హోస్ట్ గా చేసిన ‘సామ్ జామ్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా రానా తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా పౌజ్ బటన్ నొక్కితే ఎలా ఉంటుంది, తన లైఫ్ లో కూడా అలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. తనకు చిన్పప్పటి నుంచీ బీపీ ఉందని, దీంతో గుండె సంబంధిత సమస్య కూడా వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో కొంత వయసు వచ్చిన తర్వాత కిడ్నీలు కూడా పాడయ్యాయని అన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసి వీలైనంత త్వరగా వైద్యం చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారని చెప్పారు. అయితే మొదట్లో కొన్ని మందులతో ఆ సమస్య తగ్గుతుందేమో అనుకున్నారని, కానీ అది జరగలేదన్నారు. చివరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. వైద్యం చేయించుకుంటున్న సమయంలో తన కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా అనిపించేదని చెప్పారు రానా. తర్వాత కొన్ని నెలలు పాటు వైద్యం చేయించుకొని తిరిగి వచ్చానని చెప్పారు. 

రానా రీసెంట్ గా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. వెంకటేష్, రానా కలసి ఓ వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నా దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

Also Read శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే తాగుతా

Published at : 16 Mar 2023 06:45 PM (IST) Tags: Rana Daggubati Rana Naidu Rana Movies Rana Daggubati Health

సంబంధిత కథనాలు

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు