అన్వేషించండి

RAPO22: ‘సాగర్’గా వింటేజ్ లుక్‌లో రామ్... మహేష్ బాబు గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న RAPO22 మూవీ నుండి మాస్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా చెబుతూ చిత్ర మేకర్స్ రామ్ లుక్‌ని రివీల్ చేశారు.

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) అనగానే అందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ ఊర మాస్ లుక్, డైలాగ్సే గుర్తుకు వస్తుంటాయి. అలా రామ్‌ని డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మార్చేశాడు. రామ్ అని తలుచుకుంటే చాలు.. అదే అవతారం గుర్తుకు వస్తుంటుంది. కొన్నాళ్లుగా ఇదే లుక్‌లో దర్శనమిచ్చిన రామ్... ఇప్పుడు పూర్తిగా తన మేకోవర్‌ని మార్చేశారు. వింటేజ్ రామ్‌ (Rapo22)ని తలపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఓ సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం, ఆ వెనువెంటనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం చకాచకా జరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. చిత్రంలోని రామ్ క్యారెక్టర్ లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

ఈ లుక్‌లో నిజంగా రామ్ వింటేజ్ రామ్ మళ్లీ వచ్చేశాడనేలా.. ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు. ‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ పోస్టర్‌తో పాటు.. ‘‘నిజంగా అతని గురించి మీకు తెలిస్తే.. అతనిలో మీరు మిమ్మల్ని చూస్తారు. అతను సముద్రమంతటి గొప్ప సినిమా మూమెంట్స్‌ని మీ కోసం తీసుకురాబోతున్నాడు. షూటింగ్ ప్రారంభమైంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎక్స్‌లో పేర్కొంది. రామ్ 22వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీని యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్నారు. సాగర్ పాత్రలో ఇందులో రామ్ కనిపించనున్నారు. 

Also Read: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి

ఈ పోస్టర్‌లోని రామ్ లుక్ విషయానికి వస్తే.. ఓల్డ్ డేస్‌లో ఉపయోగించిన సైకిల్‌ స్టాండ్‌ని వెరైటీగా తీస్తూ ఈ పోస్టర్‌లో రామ్ కనిపించారు. అతని లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్, చేతిలో బుక్ వంటివన్నీ చూస్తుంటే ఇందులో అతను కాలేజ్‌లో చదువుకునే యువకుడిగా కనిపిస్తాడనేది అర్థమవుతోంది. అలాగే ఆ నవ్వుతున్న తీరు చూస్తుంటే.. ఒక మంచి సినిమాను మైత్రీ వారు ఇవ్వబోతున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. ఓవరాల్‌గా అయితే ఈ ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశారు మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి. మొదటి నుండి కాస్త వెరైటీ పాత్రలను ఎన్నుకుంటున్న రామ్‌కి ఇది మరో వెరైటీ చిత్రం అయ్యే అవకాశాలు లేకపోలేదు.

అలాగే రామ్‌కి ప్రస్తుతం మంచి హిట్ సినిమా కావాలి. ‘డబుల్ ఇస్మార్ట్’పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది మిక్స్‌డ్ టాక్‌కే పరిమితమైంది. మరి ఈ కుర్ర దర్శకుడు మహేష్ బాబు, రామ్‌కి ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని నెలల పాటు వెయిట్ చేయక తప్పదు. అన్నట్టు ఈ సినిమాలో రామ్ సరసన ఇటీవల రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ వదిలిన ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ సూపర్ అంటూ రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

టాప్ హెడ్ లైన్స్

ENE Repeat Srinath Maganti : గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
Bhogi Trailer Review : కోత నాది... లెక్క మీది - బొగ్గుల గుట్టలో గంగ ఊచకోతే... శర్వానంద్ 'భోగి' ట్రైలర్ హైలెట్స్
కోత నాది... లెక్క మీది - బొగ్గుల గుట్టలో గంగ ఊచకోతే... శర్వానంద్ 'భోగి' ట్రైలర్ హైలెట్స్
Psychological Thriller OTT : మనుషుల బ్రెయిన్స్‌పై టెస్టింగ్... కరోనాకు లింక్ - ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డోంట్ మిస్
మనుషుల బ్రెయిన్స్‌పై టెస్టింగ్... కరోనాకు లింక్ - ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డోంట్ మిస్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
YSRCP Organizational Revamp: డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
YS Sharmila: బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
Embed widget