Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు
Animal Movie: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కలిసి క్రియేట్ చేసిన మ్యాజిక్‌కు రామ్ గోపాల్ వర్మ ఫుల్‌గా ఫిదా అయ్యారు. ఈ విషయం తన డీటేయిల్ రివ్యూ చూస్తే అర్థమవుతోంది.
Ram Gopal Varma : ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఎక్కడ చూసినా ‘యానిమల్’ పేరే వినిపిస్తోంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్‌ను ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. అందుకే కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్’ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ‘యానిమల్’కు పాజిటివ్ రివ్యూను అందించారు. అందులో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. కానీ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఆలోచించే వర్మ.. రివ్యూను కూడా డిఫరెంట్‌గా ఇచ్చారు.
నిజాలను నగ్నంగా..
‘యానిమల్’ అనేది కేవలం ఒక మామూలు సినిమా కాకుండా దీనిని ఒక సోషల్ స్టేట్‌మెంట్ అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. ‘‘ఈ కంటెంట్ గురించి చాలా పెద్ద గొడవలే జరగనున్నాయి. ‘యానిమల్’లో రణబీర్ క్యారెక్టర్ అనేది బాక్సాఫీస్ రన్ పూర్తయిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోతుంది. సందీప్.. తన చెప్పిన ఎన్నో నిజాలను నగ్నంగా నైతిక వంచన అనే ముసుగును తీసేశాడు. కాబట్టి కల్చర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఇది ట్రిగర్ చేయనుంది’’ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. సినిమా గురించి మాత్రమే కాదు.. ఇందులో రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ గురించి కూడా వర్మ చెప్పుకొచ్చారు.
ఆ సీన్ అయితే అద్భుతం..
‘‘ఈ సినిమాలో మరొక అద్భుతమైన మూమెంట్ ఏంటంటే.. విజయ్.. తన ఫ్యామిలీ ముందు, స్టాఫ్ ముందు తన ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది అని చెప్పడం కోసం నగ్నంగా నడవడమే’’ అని ‘యానిమల్’లోని ఆ సీన్ ప్రత్యేకంగా తనకు ఎంత నచ్చిందో తెలిపారు వర్మ. అంతే కాకుండా ‘‘1913లో భారత్‌లోని విడుదలయిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర దగ్గర నుంచి 2023 వరకు.. ఈ 110 ఏళ్లలో ‘యానిమల్’లో రణబీర్ క్యారెక్టర్‌కు ఉన్నంత ఇంటెన్సిటీకంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న పాత్రలే వచ్చాయి. కానీ అమ్మాయిని తన షూను నాలుకతో ముట్టుకోసమనే సీన్‌లో మాత్రం ‘ది వాల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ చిత్రంతో లియోనార్డో డికాప్రిషియో కంటే రణబీర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది’ అంటూ ఏకంగా హాలీవుడ్ యాక్టర్‌తోనే పోల్చారు.
పాదాలు ఫోటో పంపు..
సందీప్ రెడ్డి వంగా వర్క్ తనకు బాగా నచ్చిందని, తన పాదాల ఫోటో పంపిస్తే వాటికి నమస్కరిస్తానని చెప్తూ.. దానికి కారణాలు కూడా చెప్పారు. ‘‘1. ప్రొఫెషనల్ కెమెరా అనేది కనిపెట్టినప్పటి నుంచి ఫిల్మ్ మేకర్స్ అంతా నమ్మే ప్రతీ రూల్‌ను నువ్వు పక్కన పెట్టేశావు. 2. భవిష్యత్తులో బాలీవుడ్‌లో లేదా సౌత్‌లో అయినా ఫిల్మ్ ఆఫీసుల్లో ఫిల్మ్ మేకర్స్.. తమ సినిమాల గురించి నిర్ణయాలు తీసుకునే సమయంలో నీ సినిమా అనేది ఒక ఘోస్ట్‌లాగా వారిని వెంటాడుతుంది. 3. అప్పటి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నుంచి ఇప్పటి స్టీవెన్ స్పీల్‌బర్గ్ వరకు ఎంతోమంది దర్శకులు సినిమా, సీన్స్ అనేవి ఎంత కుదిరితే అంత చిన్నగా ఉండాలని చూస్తారు. కానీ నువ్వు వారి నమ్మకాలను చంపేశావు. నీ సినిమాలోని ప్రతీ ఇంచ్ నాకు నచ్చింది. 4. ప్రతీ భాషలోని స్టార్లు ఇలాంటి ఒక పాత్ర చేయాలని కోరుకుంటారు. దానివల్ల కొత్త రైటర్స్, దర్శకులు పుట్టుకొస్తారు. క్రియేటివిటీ, ఒరిజినాలిటీ అనే అంశాలు ఎక్కువగా వ్యాపిస్తాయి’’ అని అన్నారు రామ్ గోపాల్ వర్మ.
“యానిమల్ " సినిమా గురించి నా రివ్యూ
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
- రామ్ గోపాల్ వర్మ https://t.co/QlP7onjEQY
అలా చేయాలని ఉంది..
రామ్ గోపాల్ వర్మకు ‘యానిమల్’ ఎంత నచ్చిందో ఆయన ఇచ్చిన రివ్యూ చూస్తుంటేనే అర్థమవుతోంది. చివరిగా ‘నేను ముందుగానే చెప్పినట్టు రణబీర్.. అమ్మాయిని తన షూను నాకమని అడిగిన సీన్ మాత్రం నాకు నచ్చలేదు. కానీ ఎండ్ టైటిల్స్ సమయంలో అనిల్ కపూర్ చివరి డైలాగ్ దగ్గర నుంచి జంప్ కట్ చేసి శక్తి కపూర్ ఒడిలో రణబీర్ చిన్నపిల్లాడిలాగా ఏడ్చిన షాట్ చూస్తుంటే మాత్రం నాకు మీ ఇద్దరి షూలు నాకాలని ఉంది’ అంటూ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్‌తో తన రివ్యూను ముగించారు ఆర్‌జీవీ.
Also Read: 'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక - యానిమల్ సక్సెస్ టు హైదరాబాద్ సెట్స్!