Pithapuram: పిఠాపురంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన శర్వా - Election Results 2024 వచ్చిన నెక్ట్స్ డే రామ్ చరణ్ అతిథిగా?
Sharwanand: ప్రామిసింగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మనమే'. ఈ సినిమా కోసం పిఠాపురంలో రామ్ చరణ్ అతిథిగా భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
Pithapuram News - Manamey Pre Release Event: పిఠాపురం... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల చూపు ఆ ఊరు మీద ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణ ప్రజల్లో ఆ ఊరి పేరు మార్మోగుతోంది. అందరూ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. Election Results 2024 వచ్చిన నెక్స్ట్ డే అక్కడ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ప్రామిసింగ్ హీరో శర్వానంద్.
పిఠాపురంలో 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్
Manamey pre release event: ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే... ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయం తథ్యమని చెబుతున్నారంతా! ప్రజలకు సైతం ఆయన గెలుపు మీద సందేహాలు లేవని ట్రెండ్ బట్టి అర్థం అవుతోంది. పవన్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? అనేది చూడాలని ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. మరోవైపు పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. జూన్ 5న పిఠాపురంలో 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని శర్వానంద్ అండ్ 'మనమే' టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
రామ్ చరణ్ ముఖ్య అతిథిగా 'మనమే' ఈవెంట్?
Ram Charan to attend Manamey pre release: మెగా ఫ్యామిలీకి శర్వానంద్ బాగా క్లోజ్. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు ఆయన క్లోజ్ ఫ్రెండ్. అలాగే, 'మనమే' నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ కీలక వ్యక్తుల్లో ఒకరైన నిర్మాత విక్రమ్ కూడా వాళ్లిద్దరికీ క్లోజ్. స్నేహితుల కోసం 'మనమే' ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్ అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు... అదీ పిఠాపురంలో... రామ్ చరణ్ ముఖ్య అతిథిగా... అంటే పవన్ కళ్యాణ్ విజయోత్సవ సభ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. మరిన్ని మూవీ ఈవెంట్స్ అక్కడ చేసే ఉద్దేశంలో కొందరు దర్శక నిర్మాతలు ఉన్నారట.
'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేయడానికి ఇంకా పర్మిషన్ రాలేదని తెలిసింది. ఒక్కసారి పోలీసుల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయాలని చూస్తోంది.
Also Read: కాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
జూన్ 7న థియేటర్లలోకి రానున్న 'మనమే'
Manamey Release Date: 'మనమే' చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వా జోడీగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి యాక్ట్ చేసింది. శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ ఓ మెయిన్ రోల్ చేశాడు. జూన్ 7న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. శర్వానంద్ తండ్రి అయ్యాక వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అన్నట్టు... ఈ మూవీకి 'హృదయం', 'హాయ్ నాన్న', 'ఖుషి' ఫేమ్ హేషమ్ మ్యూజిక్ చేశాడు. ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
Also Read: రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ యాడ్ చేయనన్న అల్లు అర్జున్ - బన్నీపై ప్రశంసలు