Image Source: Oke Oka Jeevitham Movie Unit

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్, కామెడీతో రూపొందిన సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాలో ఎలా ఉందో చూడండి.

కథేంటి? : ఆది (శర్వా), శ్రీను (కిశోర్), చైతు (ప్రియదర్శి)... ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఆది తల్లి 20 ఏళ్ల క్రితం మరణిస్తుంది.

టైమ్ మెషీన్ సహాయంతో కాలంలో 20 ఏళ్ల వెనక్కి పంపిస్తానని ఆదితో సైంటిస్ట్ రంగి కుట్ట పాల్ (నాజర్) చెబుతారు.

ఆదితో పాటు శ్రీను, చైతు కూడా వెళతాడు. కాలంలో వెనక్కి వెళ్లిన ముగ్గురూ ఏం చేశారు? ఏమైంది? అనేది సినిమా

ఎలా ఉంది? : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను సైన్స్ ఫిక్షన్‌కు కాకుండా కామెడీ, మదర్ ఎమోషన్స్ సీన్స్‌కు వాడుకున్నారు దర్శకుడు.

ప్రేక్షకులకు తెలిసిన వినోదం, భావోద్వేగాలను టైమ్ ట్రావెల్ కాన్సెస్ట్‌లో కొత్తగా చూపించారు.

సినిమా స్లోగా ఉంటుంది. కానీ, ఎంగేజ్ చేస్తుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ సూపర్. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటే బావుండేది.

శర్వానంద్, అమల, ముగ్గురు చిన్నారులు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. పాత్రల్లో జీవించారు.

'వెన్నెల' కిశోర్, ప్రియదర్శి, రీతూ వర్మ కూడా సన్నివేశాలకు అనుగుణంగా నటిస్తూ పాత్రల న్యాయం చేశారు. 

'ఒకే ఒక జీవితం' నవ్విస్తుంది, కంటతడి పెట్టిస్తుంది, చివర్లో సందేశం ఇస్తుంది. స్లోగా ఉండటం మైనస్.