అందం, అభినయం కలబోసిన తెలుగింటి అందాల బొమ్మ ఈషా రెబ్బ.

ఈ భామ గురించి తాజాగా ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది.

ఈషా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ఆమె ఓ తమిళ స్టార్ డైరెక్టర్‌‌ను పెళ్లాడనుందని టాక్.

చాలా కాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారట.

ఇరువురు తమ పెద్దలకు ప్రేమ సంగతి చెప్పి ఒప్పించినట్టు సమాచారం.

త్వరలోనే ఈ జంట ఏడడుగులు వేయబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయ్.

దీనిపై ఈషా ఇంకా స్పందించలేదు.

అయితే, ఈషా పెళ్లాడబోయే ఆ డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

ఈషా మలయాళంలో నటించిన ‘ఒట్టు’ చిత్రం సెప్టెంబర్ 8న రిలీజైంది.

ఈ సినిమా హిట్ కొడితే ఈషా అక్కడే సెటిలైపోతుందేమో.

Images and Video Credit: Eesha Rebba/Instagram