కథ: నార్త్ ఈస్ట్ బోర్డర్‌లోని సెక్టార్ 42లోకి సైనికులు ఎవరు వెళ్లినా మరణిస్తారు. ఒక సైనికుడు మిగతా సైనికులను కాల్చడం జరుగుతుంది. కెప్టెన్ విజయ్ కుమార్ (ఆర్య) టీమ్ తృటిలో ప్రమాదం నుంచి బయట పడుతుంది. వాళ్ళను మళ్ళీ సైంటిస్ట్ కీర్తి (సిమ్రాన్) సెక్టార్ 42కి తీసుకువెళుతుంది. కీర్తి లక్ష్యం ఏమిటి? సెక్టార్ 42లో మినటార్స్ ఉన్నాయని తెలిశాక విజయ్ ఏం చేశారు? అనేది సినిమా. ఎలా ఉంది? 'కెప్టెన్' కథ కొత్తగా లేదు. హాలీవుడ్‌లో మ్యాన్ వర్సెస్ క్రియేచర్ బేస్డ్ సినిమాలు చూసి కథ రాసినట్లు ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ రొటీన్‌గా, ఊహించే విధంగా ఉంది. క్యారెక్టరైజేషన్లను సరిగా రాసుకోలేదు. ఆర్య ఫిట్‌నెస్, ఫిజిక్ బావున్నాయి. నటుడిగా ఆయన కష్టపడ్డారు. అయితే, ఆయన క్యారెక్టర్‌ను కూడా సరిగా రాసుకోలేదు. సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్లు, ఆ ట్విస్టులు కూడా రొటీన్‌గా ఉన్నాయి. బడ్జెట్ పరిమితుల కారణంగా వీఎఫ్ఎక్స్ బాలేదని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ సోసోగా ఉంది. ఉన్నంతలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన మెలోడీ సాంగ్ బావుంది. డి. ఇమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించేలా ఉన్నప్పటికీ... సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ బావున్నాయి. హాలీవుడ్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని 'కెప్టెన్'కు వెళితే డిజప్పాయింట్ అవుతారు. అయితే, డిఫరెంట్‌గా చేయాలనుకున్న ఆర్య ప్రయత్నాన్ని అభినందించాలి.