కొన్ని సినిమా కాంబినేషన్స్ భలే హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ, అవి తెరపైకి వచ్చే వరకు అనుమానమే. అల్లు అర్జున్ - శ్రీరామ్ వేణు: వీరి కాంబినేషన్‌లో ‘ఐకాన్’ వస్తుందన్నారు. కానీ, అప్‌డేట్స్ లేవు. వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్: ప్రకటనకే పరిమితమైంది. అల్లు అర్జున్ - కొరటాల శివ: AA21 ప్రకటించారు. బన్నీతో అనుకున్న స్టోరీనే ఎన్టీఆర్‌తో తీసినట్లు టాక్. చిరంజీవి - రామ్ గోపాల్ వర్మ: ‘వినాలని ఉంది’, షూటింగ్ మధ్యలో ఆగింది. పాటలు కూడా వచ్చాయి. కానీ, రిలీజ్ కాలేదు. సింగీతం - పవన్ కళ్యాణ్: పవన్ జీసస్ పాత్రతో సినిమా అనుకున్నారు. కానీ, మధ్యలో ఆగింది. మహేష్ బాబు - సుకుమార్: వీరి కాంబినేషన్‌లో సినిమా అనుకున్నారు. కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మధ్యలో ఆగింది. పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహీ’: ఈ సినిమాకు పోస్టర్ రిలీజ్ అయ్యింది. కానీ, సినిమా ఆగింది. నర్తన శాల: బాలకృష్ణ నటించిన ‘నర్తనశాల’ ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. సౌందర్య మరణంతో షూటింగ్ ఆగిపోయింది. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ: ‘లైగర్’ ఫలితంతో ‘జన గణ మన’ మూవీ ఆగిపోయినట్లు సమాచారం.