హ్యాపీ బర్త్ డే రాధికా ఆప్టే

ప్రముఖ నటి రాధికా ఆప్టే పుట్టిన రోజు సెప్టెంబర్ 7.

సినిమాలతో సంబంధం లేని కుటుంబ నుంచి వచ్చింది రాధికా.

అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. ఈమెకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు.

ఆర్జీవీ రక్త చరిత్ర సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.

సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటిగా ఉండేది.

సొంత ఊరు పుణెలో చాలా నాటక సంస్థలతో కలిసి పనిచేసింది.

బాలయ్య పక్కన లెజెండ్, లయన్ సినిమాల్లో జోడీ కట్టింది.

వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీగా మారింది రాధికా.

ఈమె 2012లో బెనెడిక్ట్ టేలర్ అనే బ్రిటిష్ సంగీత కారుడిని పెళ్లాడింది.