అమితాబ్ బచ్చన్ కుమార్తె పాత్రలో రష్మిక మందన్న నటించిన సినిమా 'గుడ్ బై'. హిందీలో ఆమెకు తొలి చిత్రమిది. ముంబైలో మంగళవారం 'గుడ్ బై' సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 'గుడ్ బై' ట్రైలర్ లాంచ్ తర్వాత గుడికి వెళ్లారు రష్మిక. అక్కడి నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లారు. రెండు చోట్ల రష్మికను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ రష్మికను ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు. ఒక సమయంలో ఫోటోలు ఇస్తూ... తన ఫ్లైట్ మిస్ అవుతుందని అభిమానులకు రష్మిక సుతిమెత్తగా చెప్పారు. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా నేషనల్ క్రష్ రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్టోబర్ 7న 'గుడ్ బై' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిరోజు అమితాబ్ బచ్చన్ ను సెట్ లో పలకరిస్తే పెద్దగా స్పందించలేదని... ఆయనకు తాను నచ్చలేదని అనుకున్నానని రష్మిక తెలిపారు. 'పుష్ప' సినిమాలో తన పోస్టర్ అమితాబ్ ట్వీట్ చేయడం చూసి చాలా సంతోషించానని రష్మిక మురిసిపోయారు. ఇప్పుడు తమిళ స్టార్ విజయ్ 'వారసుడు'లో రష్మిక నటిస్తున్నారు.