టాలీవుడ్‌లో అత్యధిక తల్లిపాత్రలు పోషించిన నటుల్లో ప్రగతి కూడా ఒకరు. ఒంగోలులోని ఉలవపాడుకు చెందిన ప్రగతి వయస్సు 46 ఏళ్లు. 1994లో తమిళంలో విడుదలైన ‘వీట్లా విషేశాంగ’ ప్రగతి తొలి చిత్రం. ప్రగతి కెరీర్ ఆరంభంలో కార్టూన్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనలో నటించారు. ఆ ప్రకటన చూసి.. దర్శకుడు, నటుడు భాగ్యరాజా తన సినిమాలో ప్రగతికి ఛాన్స్ ఇచ్చారు. ఏడు తమిళం, ఒక మలయాళీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన తర్వాత ప్రగతి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మూడేళ్లు బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం సీరియల్స్‌లో నటించారు. 2002లో ‘బాబీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రగతి ఎంట్రీ ఇచ్చారు. ప్రగతి నిత్యం వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉంటారు. డ్యాన్సులు చేస్తూ హుషారుగా ఉంటారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రగతి తాజాగా పొట్టి డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఇది చూసి ప్రగతి దగ్గర టైమ్ మెషీన్ ఉందని, కాలాన్ని వెనక్కి నెట్టి ఆమె యంగ్‌గా మారిపోతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రగతి ఎనర్జీని చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుందా? Images & Video Credit: Pragathi/Instagram