సాయి పల్లవి అంటే మన ఇంట్లో పిల్లలా అనిపిస్తుంది. అందమే కాదు, ఆమె మనసు కూడా చాలా మంచిది. డాక్టర్ కాబోయి యాక్టరైనా ఈమెకు ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ చెప్పబోయి.. ఈమె అనుకోని వివాదంలో చిక్కుకుంది. దీంతో సాయి పల్లవి సారీ చెప్పి.. కూల్ చేసింది. ఇటీవలే సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’, ‘గార్గీ’ విడుదలయ్యాయి. ఆ సినిమాలు పెద్ద హిట్ కొట్టలేదు. కానీ, సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కాయి. సాయి పల్లవి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టూర్‌లో ఉంది. సాయి పల్లవి తమిళనాడులోని తంజావూరులో ఉంది. అక్కడి ప్రఖ్యాత బృహదీశ్వరాలయాన్ని సాయి పల్లవి సందర్శించింది. సాయి పల్లవితో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న తల్లిదండ్రులు. Images and Videos Credit: Sai Pallavi/Instagram