రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు దక్షిణాదిలో పెద్దగా సినిమాల్లేవు. టాలీవుడ్‌లో కూడా పెద్దగా అవకాశాలు లభించడం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం రకుల్ బిజీగానే ఉంది. అయితే, అక్కడ కూడా రకుల్‌కు లక్ కలిసి రావడం లేదు. ఇటీవల విడుదలైన ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. రకుల్ మాత్రం పట్టువదలకుండా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ‘కట్ పుతిలి’ (తెలుగులో ‘రాక్షసుడు’) కూడా హిట్ కొట్టలేదు. అయితే, ఆ సినిమాలోని రబ్బా సాంగ్‌లో మాత్రం రకుల్ డ్యాన్స్ అదరగొట్టింది. ఈ సందర్భంగా రకుల్ ఆ సాంగ్ మేకింగ్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. Images and Videos Credit: Rakul Preet Sing/Instagram