‘పుష్ప: ది రైజ్’తో బన్నీ ఇప్పుడు ఇండియాకే ఫేవరెట్ స్టార్. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే బన్నీ తన ఫ్యామిలీతో వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. తాజాగా బన్నీ తన కూతురు అర్హతో కలిసి పబ్లిక్‌లోకి వచ్చారు. గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. ఆ తర్వాత బన్నీ.. తన కూతురు అర్హాను ఊరేగింపు వాహనంపైకి ఎక్కించారు. వినాయక నిమజ్జనోత్సవాన్ని చూసి అర్హా ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యింది. మొత్తానికి బన్నీ ఇలా అర్హాతో కలిసి బయటకు రావడం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.