బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్ తెలుగులో కూడా పలు చిత్రాలలో కనిపించింది. ముఖ్యంగా బాలయ్య నటించిన మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సోనాల్. కుర్ర హీరోలతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. మధ్యలో హీరో రామ్ తో కలిసి 'పండగ చేస్కో' అనే సినిమాలో నటించింది సోనాల్. తెలుగులో ఈ బ్యూటీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను అందుకోలేకపోయింది. రీసెంట్ గా ఈమె నటించిన 'ఎఫ్3' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సోనాల్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోనాల్ చౌహాన్ లేటెస్ట్ ఫొటోలు