స్టార్ యాంకర్ శ్రీముఖి ఆదివారం 'జీ తెలుగు'లో టెలికాస్ట్ అయిన 'మన ఊరి రంగస్థలం' కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. 'మన ఊరి రంగస్థలం' కార్యక్రమంలో శ్రీముఖి ఈ దుస్తుల్లో సందడి చేశారు. 'మన ఊరి రంగస్థలం'లో హైలైట్ ఏంటంటే... సింగర్ చరణ్‌తో శ్రీముఖి వేసిన స్టెప్స్. చరణ్‌తో కలిసి స్టెప్స్ వేయడమే కాదు... ఇటీవల ఎంతో పాపులర్ అయిన 'బంగారం... ఒకటి చెప్పనా?' డైలాగ్ చెప్పారు. 'మన ఊరి రంగస్థలం'లో సుధీర్ బాబు, ఇంద్రగంటి, సంగీత దర్శకుడు కాలభైరవ, హీరో శ్రీ సింహ సందడి చేశారు. హాఫ్ శారీలో శ్రీముఖి చాలా అందంగా ఉన్నారని నెటిజన్స్, ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శ్రీముఖి నగలు రోల్డ్ గోల్డ్ అని, వాటిపై తమకు ఇంట్రెస్ట్ పోయిందని కాల భైరవ అనడంతో అందరూ నవ్వేశారు. శ్రీముఖికి పెళ్లి కళ వచ్చిందని కూడా కొందరు కామెంట్ చేయడం విశేషం. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (All Images Credit: Sreemukhi/Instagram)