మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా 'కార్తికేయ2' సినిమాతో మంచి హిట్ అందుకుంది అనుపమ. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.