‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మోనల్ గజ్జర్.

ఆమె తొలి సినిమా హిట్టయినా, ఆమెకు మాత్రం లక్ కలిసి రాలేదు.

దుకాణం సర్దేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ‘బిగ్‌బాస్’ సీజన్-4లో అవకాశం వచ్చింది.

‘బిగ్ బాస్‌’లో మోనల్‌.. అఖిల్‌తో జతకట్టింది. వారి స్నేహం బయట కూడా కొనసాగింది.

ఇద్దరు కలిసి ఒక వెబ్ సీరిస్‌కు కూడా సైన్ చేశారు. కానీ, అది ఆగిపోయినట్లు తెలిసింది.

ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యహరించిన తర్వాత మోనల్ గుజరాత్‌కు వెళ్లిపోయింది.

ప్రస్తుతం గుజరాతీ సినిమాల్లో మోనల్ బిజీగా ఉంది.

అఖిల్, మోనల్ ఇప్పుడు కలుసుకోవడం లేదని టాక్. దీంతో బ్రేకప్ రూమర్స్ వస్తున్నాయి.

అయితే, అఖిల్ మోనల్ ఎప్పుడూ ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు.

ప్రస్తుతం మోనల్ మరో డ్యాన్స్ షోలో జడ్జిగా పాల్గొంటోంది.

తాజాగా మోనల్ ‘‘నేను నీ కంటే రెండేళ్లు పెద్ద..’’ అంటూ ఓ రీల్ వీడియో చేసింది.

ఎవరి కోసం ఆ వీడియో అంటూ అభిమానులు ఆమెను ఆటపట్టిస్తున్నారు.

Images and Videos Credit: Akhil and Monal/Instagram