వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'రంగ రంగ వైభవంగా'. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? కథేంటి? : రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) పేరెంట్స్ క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఓకే రోజు ఒకే ఆస్పత్రిలో జన్మించారు. చిన్నతనంలో రిషి, రాధ స్నేహంగా ఉంటారు. స్కూల్‌లో జరిగిన ఒక ఇష్యూ వల్ల మాట్లాడుకోవడం మానేస్తారు. ఆ గొడవ ఏంటి? వాళ్ళిద్దరూ ఒక్కటైన టైమ్‌లో రెండు కుటుంబాల మధ్య మరో గొడవ అవుతుంది? ఆ గొడవ ఏంటి? మళ్ళీ ఎలా ఒక్కటయ్యారు? అనేది సినిమా. సినిమా ఎలా ఉంది? : 'రంగ రంగ వైభవంగా' కథలో కొత్తదనం లేదు. చాలా రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో తీశారు. సినిమా చూస్తున్నంత సేపు గతంలో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు గుర్తుకు వస్తాయి. వైష్ణవ్ తేజ్ లుక్స్, స్టైలింగ్ బావున్నాయి. హ్యాండ్సమ్‌గా ఉన్నారు. యాక్టింగ్ ఓకే. కొన్ని సీన్స్‌లో పవన్‌ను గుర్తు చేశారు. కేతికా శర్మ ట్రెడిషనల్ డ్రస్‌లలో కనిపించారు. లవ్, రొమాంటిక్ సీన్స్‌లో చక్కగా నటించారు. ఎమోషనల్ సీన్స్‌లో ఇంప్రూవ్ అవ్వాలి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి. సినిమా ఫస్టాఫ్‌లో సీన్స్ రొటీన్‌గా ఉన్నప్పటికీ... వైష్ణవ్, కేతిక కెమిస్ట్రీ & సాంగ్స్ వల్ల ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా నెక్స్ట్ సీన్స్ ఉంటాయి. 'రంగ రంగ వైభవంగా' కొత్తగా ఏమీ లేదు. రెగ్యులర్ రొటీన్ స్టఫ్. అయినా ఎంజాయ్ చేయగలం అనుకుంటే థియేటర్లకు వెళ్లొచ్చు.