పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కిక్కించే టైటిల్ కార్డ్ ఇది. అయితే, పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. 1996లో పవన్ ‘అబ్బాయి అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ‘ఇతడే మన కళ్యాణ్’ అని టైటిల్‌లో చూపించారు. ఆ తర్వాత వచ్చిన ‘గోకులంలో సీత’ మూవీలో పవన్ కళ్యాణ్‌గా పేరు మార్చారు. వాస్తవానికి పవన్ సినిమాల్లోకి రాకముందే పేరు మార్చుకున్నారట. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణలో ఆయన పేరు పవన్ కళ్యాణ్ అనే ఉంటుందట. ఇప్పుడు పవర్ స్టార్ అంటే అభిమానులకు ఒక వైబ్రేషన్. ఇప్పుడు పవర్ స్టార్ అంటే అభిమానులకు ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్.. పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయ్. ఫ్యాన్స్ అభిమానం ఓట్లుగా మారితే పవర్ స్టార్‌కు రాజకీయాల్లో కూడా తిరుగే ఉండదు. పవన్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఇంకా చాలా శ్రమించాల్సి ఉంటుంది.