మోడల్ గా కెరీర్ ఆరంభించిన శ్రీలీల 'పెళ్లి సందడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. ముందుగా రవితేజ నటిస్తోన్న 'ధమాకా' సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు శ్రీలీలకు మరో రెండు సినిమాల ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ హీరోలుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.