హిమజా సినిమాల్లో చేసేవి చిన్న పాత్రలే. కానీ, ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

హిమజా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది.

యూట్యూబ్ చానెల్‌లో సైతం వెరైటీ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది.

తాజాగా హిమజా దొంగను పట్టుకున్న వీడియో పోస్ట్ చేసింది.

గుర్తుతెలియని యువకుడు ఆమె బెంజ్ కారు ఎంబ్లెమ్(చిహ్నం) విరగొట్టాడు.

ఆ తర్వాత దాన్ని జేబులో పెట్టుకుని చల్లగా జారుకున్నాడు.

దాని విలువ సుమారు 10 వేల వరకు ఉండవచ్చని హిమజా తెలిపింది.

ఇదంతా సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. దీంతో హిమజా అతడిని గుర్తుపట్టింది.

పోలీసులకు ఫిర్యాదు చేయకుండా హిమజ అతడికి క్లాస్ పీకి పంపేసింది.

ఈ వీడియోను మీరు.. హిమజా యూట్యూబ్ చానల్‌లో చూడొచ్చు.

హిమజ చేసిన పనిని అంతా మెచ్చుకుంటున్నారు.

Images Credit: Himaja/Instagram