బాలీవుడ్ లో నటిగా ఎన్నో సినిమాలు చేసింది హుమా ఖురేషి. సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్, రియాలిటీ షోలలో కనిపించింది. సౌత్ లో కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. 'కాలా', 'వలిమై' చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఈ సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో ఆమెకి పెద్దగా కలిసి రాలేదు. బాలీవుడ్ లో ఆమె చివరిగా 'గంగూబాయ్' సినిమాలో కనిపించింది. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది హుమా. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.