Ram Charan's RC15 In Vizag: వైఫ్ ఉపాసనకు స్వీట్ మెసేజ్ షేర్ చేసిన రామ్ చరణ్
వైఫ్ ఉపాసనకు ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్ స్వీట్ మెసేజ్ షేర్ చేశారు. అదేంటి? అంటే...
శ్రీమతి ఉపాసనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక స్వీట్ మెసేజ్ షేర్ చేశారు. అదేంటో తెలుసా? "ఉపాసనా... నాకూ హాలిడేకి వెళ్లాలని ఉంది. అయితే, కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. విశాఖలో RC15 షూటింగ్ చేస్తున్నాను కదా!'' అని రామ్ చరణ్ పోస్ట్ చేశారు. దీనికి కారణం ఏంటో తెలుసా? నిన్న ఉపాసన ఒక పోస్ట్ చేశారు.
View this post on Instagram
''విహారయాత్రకు వెళ్లాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ఈ హీట్ (వేసవి వేడి) లో హార్డ్ వర్క్ (కష్టపడి పని) చేయక తప్పదు'' అని ఉపాసన పేర్కొన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు టూర్ వేశారు. అప్పుడు దిగిన ఫొటోలను ఇద్దరూ పోస్ట్ చేశారు.
View this post on Instagram
సినిమాలకు వస్తే... శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'RC15' షూటింగ్ ప్రస్తుతం విశాఖలో జరుగుతోంది. అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'చిన్ని' రివ్యూ : కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?