అన్వేషించండి

Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!

Venue locked for Ram Charan's Game Changer teaser launch: పాన్ ఇండియా సినిమాలు అయితే హైదరాబాద్ లేదంటే చెన్నై, ముంబైలో టీజర్ రిలీజ్ చేయడం కామన్. కానీ, రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కోసం కొత్తగా ఆలోచించారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). ప్రమోషనల్ ఈవెంట్స్ వచ్చేసరికి నిజంగానే సరికొత్త గేమ్ మొదలు పెట్టింది. టీజర్ లాంచ్ కోసం కొత్త ప్లాన్ వేసింది. ఈ సినిమా టీజర్ ఎక్కడ విడుదల చేయనున్నారో తెలుసా?

లక్నోలో 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల
Game Changer teaser launch in Lucknow: పాన్ ఇండియా సినిమాలు... అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసే పాన్ ఇండియా సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే హైదరాబాద్ సిటీ లేదంటే చెన్నై, ముంబై నగరాల్లో మొదలు అవుతాయి. అది కామన్! కానీ, రామ్ చరణ్ సినిమా యూనిట్ ఆ మూడు నగరాలు కాకుండా కొత్త సిటీని ఎంపిక చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సిటీలో నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయోధ్యకు లక్నో కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి టీజర్ విడుదలకు ముందు రామ్ చరణ్ సహా చిత్ర బృందం శ్రీరాముని దర్శనం చేసుకుని వస్తుందా? లేదంటే లక్నోలో ఈవెంట్ ప్లాన్ చేసిందా? అనేది త్వరలోనే తెలుస్తుంది. 

ట్రిపుల్ ఆర్ విడుదల తర్వాత నార్త్ ఇండియాలో, మరి ముఖ్యంగా‌ ఉత్తర ప్రదేశ్ థియేటర్లలో రామ్ చరణ్ గెటప్ చూసి జై శ్రీరామ్ అంటూ ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇప్పుడు అదే యూపీలో రామ్ చరణ్ తన 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల ప్లాన్ చేశారు.

Also Read: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?


మాస్ మూమెంట్స్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్
రామ్ చరణ్ నుంచి ప్రేక్షకులు అభిమానులు కోరుకునే మాస్ మూమెంట్స్ ఈ 'గేమ్ చేంజర్' టీజర్ లో పుష్కలంగా ఉన్నాయని యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అదే సమయంలో శంకర్ స్టైల్ మెసేజ్ కూడా ఉందట. చాలా రోజుల తర్వాత తాను తీసిన మాస్ సినిమా 'గేమ్ చేంజర్' అని శంకర్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన రామ్ చరణ్ లుంగీ స్టిల్ మాసీగా ఉందని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ చెబుతున్నారు. మరి, టీజర్ లో మాస్ మూమెంట్స్ ఇంకెలా ఉంటాయో?

Also Readరంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!


సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది. తెలుగు అమ్మాయి అంజలి, సీనియర్ హీరో శ్రీకాంత్, దర్శకుడు మించిన నటుడిగా మారిన ఎస్సీ సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలకపాత్రను పోషించారు.

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget