Ram Charan: బన్నీని విష్ చేయని చెర్రీ - ఆ ఊహాగానాలు వాస్తవమేనా?
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన అల్లు అర్జున్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెప్పారు. కానీ, మెగా హీరో రామ్ చరణ్ కనీసం స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
జాతీయ సినీ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని ఘనత సాధించిన బన్నీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెప్పని రామ్ చరణ్
దేశ వ్యాప్తంగా బన్నీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అల్లు అర్జున్ కు కనీసం శుభాకాంక్షలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వయంగా కలిసి అభినందనలు చెప్పకపోయినా, సోషల్ మీడియా ద్వారా అయినా విష్ చేయలేదు. మెగా స్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ బన్నీకి శుభాకాంక్షలు చెప్పినా, రామ్ చరణ్ మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని చాలా మంది నమ్ముతున్నారు.
గత కొంతకాలంగా చెర్రీ, బన్నీ మధ్య గొడవలు!
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఒకరంటే ఒకరికి పడటం లేదు. అభిమానుల మధ్యే కాదు, చెర్రీ, బన్నీ మధ్యన కూడా విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్ పలు మార్లు స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. కానీ, రీసెంట్ గా జరిగిన రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ వార్తలకు బలం చేకూరింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు శిరీష్ సహా మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అదే రోజు సాయంత్రం చెర్రీ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో అల్లు అర్జున్ కనిపించలేదు. హైదరాబాద్ లో ఉన్నా ఈ పార్టీకి రాలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో పంచాయితీ నడుస్తోందని అందరూ భావించారు.
మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు?
వాస్తవానికి చిరంజీవి గతంలో ఎక్కువగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమాలు చేసే వారు. కానీ, ఈ ఊహాగానాలు వస్తున్నప్పటి నుంచి చిరంజీవితో పాటు, రామ్ చరణ్ సినిమాలు కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితం కావడం లేదు. ఇద్దరూ ఇతర బ్యానర్లలోనే సినిమాలు చేస్తున్నారు. లేదంటే, సొంతంగానే సినిమాలు నిర్మించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ గమనిస్తే, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య పైకి చెప్పని వివాదాలు కొనసాగుతున్నాయని అర్థం అవుతోంది.
Read Also: పాపం రాజమౌళి - ఆస్కార్‌లో అలా, నేషనల్ అవార్డుల్లో ఇలా.. ‘RRR’ హీరోలదీ అదే పరిస్థితి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial