అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్‌కు మూడు నెలల బ్రేక్... అసలు కారణం అదేనా?

Ram Charan Latest News: 'పెద్ది' కోసం రామ్ చరణ్ రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. సినిమా విడుదల కావడంతో పాటు ప్రమోషన్స్ పూర్తి అయ్యాయి. దాంతో ఆయన మూడు నెలల బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.

Ram Charan To Take Three Months Rest: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' కోసం రెండేళ్ళు కష్టపడ్డారు. నటన పరంగా మానసిక శ్రమ, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం శారీరక శ్రమ పడ్డారు. 'పెద్ది' చిత్రీకరణలో రామ్ చరణ్ చేతికి గాయం కూడా అయ్యింది. అయితే సినిమా కోసం సర్జరీని వాయిదా వేశారు. ఇప్పుడు సినిమా విడుదల కావడంతో పాటు ప్రమోషన్స్ కూడా పూర్తి అయ్యాయి. దాంతో భారీ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.

సుక్కు సినిమాకు ముందు మూడు నెలల బ్రేక్!
'పెద్ది' విడుదలకు ముందు నెక్స్ట్ సినిమా ఓకే చేశారు రామ్ చరణ్. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పుడో నిర్ణయించారు. ఇప్పుడు ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందు మూడు నెలల బ్రేక్ తీసుకోనున్నారు. అదీ ఎందుకంటే... 

''రామ్ చరణ్ సుమారు మూడు నెలల పాటు నటనకు విరామం (యాక్టింగ్ బ్రేక్) ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతాయి. 'పెద్ది' కోసం చరణ్ గత రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ఎంతో శ్రమించారు. ముఖ్యంగా అథ్లెటిక్ లుక్, రెజ్లింగ్ సీన్స్ కోసం ఆయన ఎంతో శ్రమించాల్సి వచ్చింది. షూటింగ్ ఏమీ అంత ఈజీగా జరగలేదు. మధ్యలో గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడానికి, నెక్స్ట్ సినిమా కోసం తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి బ్రేక్ చాలా అవసరమని రామ్ చరణ్ భావిస్తున్నారు'' అని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

Also Read: Allu Arjun Reviews Ram Charan Peddi - రామ్ చరణ్ 'పెద్ది'కి అల్లు అర్జున్ రివ్యూ... బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఐకాన్ స్టార్ ట్వీట్

మూడు నెలల విరామ సమయంలో కుటుంబంతో, ముఖ్యంగా పిల్లలు ముగ్గురితో టైమ్ స్పెండ్ చేస్తారట. ఆ టైంలో కొత్త సినిమా షూటింగ్‌లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారట. అంతే కాదు... నెక్స్ట్ సినిమా క్యారెక్టర్ కోసం ప్రస్తుతం ఉన్న అథ్లెటిక్ బాడీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా రామ్ చరణ్ దృష్టి పెట్టనున్నారు. రామ్ చరణ్ - సుకుమార్ కొత్త చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది.

Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget