Happy Birthday Ram Charam: అప్పుడు హీరోగా పనికిరాడన్నారు - ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్టేజ్‌పై 'గ్లోబల్ స్టార్' అని పిలుపించుకున్నాడు..
Ram Charan: నేడు రామ్ చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ బిరుదు పొందిన ఈ హీరో ఇండస్ట్రీ ఎంట్రీ, సినిమాలు గురించి ఇక్కడ ఒకసారి చూద్దాం!
Ram Charan Birthday Special: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్‌లో ఓ బ్రాండ్. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో సీతారామరాజు పాత్రతో తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఎందరో సినీ దిగ్గజాల చేత ప్రశంసలు అందుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నటుడిగా.. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అలా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ గ్లోబల్ స్టార్ పుట్టిన రోజు నేడు. మార్చి 27న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ బిరుదు పొందిన ఈ హీరో ఇండస్ట్రీ ఎంట్రీ, సినిమాలు గురించి ఇక్కడ ఒకసారి చూద్దాం!
తొలి సినిమాతో తీవ్ర విమర్శలు
ఈ నిజానికి రామ్ చరణ్ బ్లడ్, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం సినీ నేపథ్యమే. ఆయన తండ్రి ఓ మెగాస్టార్.. బాబాయ్ పవర్ స్టార్. ఇంతటి సినీ నేపథ్యం నుంచి వచ్చిన నటుడిగా ఎప్పటి ఒదిగి ఉంటారు. అందుకే అతి తక్కువ టైంలోనే తండ్రిని, బాబాయ్ మించి గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చారు చరణ్. 'చిరుత' సినిమాతో మెగా వారసుడిగా పరిశ్రమలోకి అడుపెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. చిరు వారసుడు ఎంట్రీ అనగానే అభిమానులు, ఆడియన్స్ ఓ రేంజ్‌లో ఊహాల్లో తెలిపోయారు. కానీ తొలి సినిమాలో చరణ్ లుక్, పర్ఫామెన్స్‌కి అంతా నిరాశ పడ్డారు. తండ్రిలా నటించేలేకపోతున్నాడని.. తండ్రి నట వారసత్వాన్ని అతడు కొనసాగించలేడనే విమర్శలు వచ్చాయి.
'మగధీర'తో బిగ్గెస్ట్ హిట్
మెగాస్టార్ గ్రేస్, యాక్టింగ్స్ స్కిల్స్ ఇతడిలో లేవంటూ అంతా ఎద్దేవా చేశారు. హీరోగా కాదు.. నటుడిగా కూడా రామ్ చరణ్ పనికిరాడంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అవి చూసి చరణ్ వెనకడుగు వేయలేదు. అందరి విమర్శలనే పొగడ్తలుగా తీసుకుని వాటిని తన గెలుపు మెట్లుగా మలుచుకున్నాడు. ఈ విషయాన్ని చరణే ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు కూడా. ఆధైర్య పడకుండ తనలోని నటుడిని బయటపెడుతూ సినిమా సినిమాకు ఇంప్రూవ్ అయ్యారు. అలా మూడో సినిమాకే దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో పడ్డాడు. జక్కన్న దర్శకత్వంతో 'మగధీర'లో తన నట విశ్వరూపం చూపించాడు. విమర్శించివారే చేతులెత్తి ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాతో తన కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో చరణ్ లుక్,యాక్టింగ్ స్కిల్స్ చూసి తండ్రకి తగ్గ తనయుడు అంటూ అందరి చేత మన్ననలు పొందాడు.
ఆ తర్వాత 'ఆరేంజ్'లో లవర్ బాయ్ అవతారం ఎత్తాడు. ఇందులో లవర్ బాయ్‌గా మెప్పించిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే', 'ఎవడు' వంటి సినిమాలు చేసి అవి వర్క్ అవుట్ కాలేదు. కానీ తనదైన నటన, డ్యాన్స్ స్కిల్స్‌తో స్టార్ హీరో ఇమేజ్‌ని క్యారీచేస్తూనే వచ్చాడు. 'ధృవ' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' మూవీ చేశాడు. ఈ చిత్రం చరణ్ పూరిపూర్ణ నటుడిగా మారాడు. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ సాహసం చేశాడనే చెప్పాలి.
'రంగస్థలం'తో సాహసం
స్టార్ హీరో అయినా చెవుడు అనే డిసెబుల్ క్యారెక్టర్ చేసి ప్రతిఒక్కరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ చరణ్ సినీ కెరీలోనే ఓ మైలు రాయి అని చెప్పాలి. ఈ సినిమా ముందుకు మెగా హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పిలిచేవారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తనయుడు అనే గుర్తింపులోనే ఉన్నాడు. ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని చాటుకున్నాడు. ఏకంగా ఇంటర్నేషనల్ స్టేజ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని పిలిపించుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ ముందుకు వరకు తండ్రికి తనయుడు అన్న వారంత తండ్రి మించిన తనయుడు అనడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గుర్తింపు పొంది.. మెగా హీరోల్లోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను చాటుకున్నాడు. నిజానికి ఇండస్ట్రీలో మెగా హీరోనే ఓ బ్రాండ్.. కానీ దానిమించి గ్లోబల్ స్టార్ బిరుదు అందుకున్నాడు.
ఈ సినిమాతో సీతారామారాజు పాత్రతో ఇండియన్ ఆడియన్స్‌నే కాదు వరల్డ్ వైడ్ ఉన్న ఎంతో మంది సినీ ప్రియులు మనసు గెలుచుకున్నాడు. ఇంతటి ఘనవిజయం, అరుదైన బిరుదు ఉన్న ఇప్పటికీ చరణ్ ఇండస్ట్రీలో తనకంటే పెద్దవారికి ఇచ్చి గౌరవం ప్రతిఒక్కరి మనసును హత్తుకుంటుంది. తాను గ్లోబల్ స్టార్ అయినా ఎలాంటి స్టేజ్‌పై ఉన్న తన కంటే పెద్ద వారి ముందు నిలబడే ఉంటాడు. తనంతే గొప్ప నటుడైన ఈ పెద్దల ముందు చిన్నవాడినే అంటూ ఒదిగిపోతాడు. ఈ మనస్తత్వం, ఒదిగిపోయే తత్త్వంతోనే అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీలో ఎందరలో సహా నటీనటుల మనసు గెలుచుకున్నాడు ఈ గ్లోబల్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.