అన్వేషించండి

Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక 'కమిటీ కుర్రోళ్లు'పై రామ్‌ చరణ్‌, జక్కన్న ప్రశంసలు - ఏమన్నారంటే..

Ram Charan Praises Niharika: నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్లు మూవీ సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీపై సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ నిహారికపై...

Ram Charan and SS Rajamouli Congratulations to Niharika: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన తొలి సినిమా 'కమిటీ కుర్రోళ్లు'. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. చిన్న సినిమాగా ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేసిన సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 6.04 కోట్ల‌ గ్రాస్ వసూళ్లు చేసింది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుంటున్న బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్‌ కూడా అందుకుంటోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఈ సినిమాని ప్రశింసిస్తూ నిహారిక కొణిదెలకు శుభాకాంక్షలు తెలిపాడు. తాజాగా రామ్‌ చరణ్‌ కూడా నిహారికపై ప్రశంసలు కురిపించాడు. 'కమిటీ కుర్రోళ్లు' ఘనవిజయం సాధించినందుకు అభినందనలు నిహారిక తల్లి! మీ టీంతో పాటు నీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ మూవీ కాస్ట్‌ అండ్‌ క్రూ ఎఫర్ట్స్‌కి అభినందనలు. ఇక ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక అభినందనలు!" అంటూ చెల్లి నిహారికపై ప్రశంసలు కురిపించాడు చరణ్‌.

అలాగే ఎస్‌ఎస్ రాజమౌళి కూడా కమిటీ కుర్రాళ్లు మూవీపై ట్వీట్‌ చేశారు. "యంగ్ టీమ్ సాధించిన పెద్ద విజ‌యం ఇది. థియేట‌ర్స్‌లో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయ‌ని తెలిసింది. నిర్మాత నిహారిక, డైరెక్ట‌ర్ య‌దు వంశీ స‌హా ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు" అని పేర్కొన్నారు. అలాగే క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ కూడా ట్వీట్‌ చేశారు. "కమిటీ కుర్రోళ్ళు' మంచి విజ‌యం సాధించిందని వినడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన నిర్మాత నిహారిక‌, డైరెక్ట‌ర్ యదు వంశీకి అభినంద‌లు. అలాగే మ‌న్యం ర‌మేష్‌గారికి, వంశీ నందిపాటిగారికి కంగ్రాట్స్" అంటూ తన ట్వీట్‌ రాసుకొచ్చారు. అలాగే కల్కి 2898 ఏడీ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ కూడా మూవీపై టీంకు అభినందలు తెలిపారు.

"చాలా మంది యంగ్ టాలెంట్ ఈ సినిమాతో త‌మ‌ని తాము ప్రూవ్ చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్లుతో మంచి విజయం సాధించిన నిహారిక కొణిదెల‌తో పాటు మూవీ టీమ్‌కు అభినంద‌నలు" తెలిపారు. అలాగే హీరో హీరో "కమిటీ కుర్రోళ్ళ"’ గురించి చాలా గొప్ప‌గా విన్నానని, సూపర్‌ హిట్‌ అందుకున్న నిహారిక కొణిదెల‌తో పాటు ఎంటైర్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డైరెక్టర్ క్రిష్‌ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిం మూవీ టీం అభినందనలు తెలిపారు. కాగా ఈ సినిమాలోని లీడ్‌ రోల్స్‌ పోషించిన వారంత కొత్తవాళ్లే కావడం విశేషం. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో మొత్తం 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం అయ్యారు. కొంతమంది సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో తెరెక్కించిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్‌ అందుకుంటుంది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ చిత్రం వసూళ్లు పెంచుకుంటుంది, థియేట్రికల్‌ రన్‌లో క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. 

Also Read: 'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Controversy: ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదుTilak Varma Retired out | LSG vs MI మ్యాచ్ లో అతి చెత్త నిర్ణయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Controversy: ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
NTR: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
Lost Your Phone on a Train:రైలులో పోయిన మొబైల్‌ను రికవరీ చేసే యాప్‌ వచ్చేసింది? ఈ ఫెసిలిటీ తెలుసా గురూ?
రైలులో పోయిన మొబైల్‌ను రికవరీ చేసే యాప్‌ వచ్చేసింది? ఈ ఫెసిలిటీ తెలుసా గురూ?
Alekhya Chitti: తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
PF Money Withdrawl: పీఎఫ్‌ విత్‌డ్రా ఇప్పుడు ఇంకా ఈజీ, ఆ కీలక రూల్‌ రద్దు
పీఎఫ్‌ విత్‌డ్రా ఇప్పుడు ఇంకా ఈజీ, ఆ కీలక రూల్‌ రద్దు
Embed widget