అన్వేషించండి

Rajinikanth Amitabh Bachchan : 33 ఏళ్ళ తర్వాత బిగ్ బితో సూపర్ స్టార్ - సెట్స్‌లో ఇద్దరు లెజెండ్స్!

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్... ఇద్దరు లెజెండ్స్ కలిసి సినిమా చేస్తున్నారు. సెట్స్‌లో దిగిన ఫోటోలను రజని షేర్ చేశారు.

Rajinikanth and Amitabh Bachchan from Thalaivar 170 sets: సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్... భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరూ ఇద్దరే. ఒకరు ఎక్కువ... మరొకరు తక్కువ అని కాదు. ఇప్పుడీ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. అయితే... ఇవాళ ఇద్దరు కలిసి షూటింగ్ చేశారు. సెట్స్ నుంచి రజనీకాంత్ ఆ ఫోటోలు షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

తలైవర్ 170 చిత్రీకరణలో... 
రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ భారీ  సినిమా (Thalaivar 170) రూపొందుతోంది. అందులో అమితాబ్ బచ్చన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీతో పాటు ఆయనపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 

''33 ఏళ్ళ తర్వాత నా మార్గదర్శి అమితాబ్ బచ్చన్ గారితో నటిస్తున్నాను. టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నాం. నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది'' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. 

Also Read జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ

'అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్'లో ఇద్దరు లెజెండ్స్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్ళీ 33 ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారు. 

Also Read : చిరంజీవికి విలన్‌ గా రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్?

'తలైవర్ 170'లో రానా దగ్గుబాటి కూడా!
అమితాబ్ బచ్చన్ కాకుండా ఇంకా ఈ సినిమాలో రానా దగ్గుబాటి మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజూ వారియర్, 'గురు' ఫేమ్ రితికా సింగ్, దుషారా విజయన్... తెలుగు ప్రేక్షకులకు 'పుష్ప' సినిమాతో పరిచయమైన, దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో రజనీ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్కౌంటర్ విధానం లేదా వ్యవస్థ మీద పోరాటం చేసే వ్యక్తిగా సూపర్ స్టార్ పాత్ర ఉంటుందట.

రజనీతో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళ కలయికలో వచ్చిన మొదటి సినిమా '2.0' రికార్డులు క్రియేట్ చేసింది. 'దర్బార్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అందులో రజనీకాంత్ లుక్కు, యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. 'లాల్ సలాం'ను కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చూస్తుంటే... రజనీతో మరిన్ని సినిమాలు చేసేలా ఉన్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget