అన్వేషించండి

యోగి ఆదిత్య నాథ్ కాళ్ళు మొక్కడంపై ఎట్టకేలకు స్పందించిన రజినీకాంత్

తన ఆధ్యాత్మిక ట్రిప్ ముగించుకొని నేడు చెన్నై ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై వివరణ ఇచ్చారు.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా 'జైలర్' సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే జైలర్ రిలీజ్ కి ముందు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన ఈమధ్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ యోగి ఆదిత్య నాథ్ ని చూడగానే వెంటనే ఆయన కాళ్లు మొక్కారు. దీంతో ఇది కాస్త వివాదాస్పదంగా మారింది.

లక్నోలో సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు రజనీకాంత్ కారు దిగిన వెంటనే తనకు స్వాగతం పలకడానికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కాళ్ళను తాకడానికి వంగడం, వెంటనే యోగి ఆదిత్యనాథ్ సైతం రజనీకాంత్ ని ఇలాంటివి వద్దని చెప్పేలోపే ఆయన పాదాలకు నమస్కారం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అంతే అప్పటినుంచి రజనీకాంత్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

తనకంటే వయసులో చిన్నవాడైన సీఎం యోగి కాళ్ళను రజనీకాంత్ మొక్కడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోలర్స్ నానా హంగామా చేశారు. మరోవైపు రజనీకాంత్ చేసిన ఈ పని ఆయన అభిమానులకు కూడా ఆగ్రహం తెప్పించింది. వయసులో పెద్ద, అలాగే ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఒక రాజకీయ నాయకుడు, పైగా వయసులో తనకంటే 20 ఏళ్లు చిన్నవాడి కాళ్ళు మొక్కడాన్ని ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు రాజకీయపరంగా కూడా దీనిపై ఎన్నో రకాల విమర్శలను లేవనెత్తారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ఈ విషయంపై రజనీకాంత్ స్పందించనే లేదు.

అయితే తాజాగా తన ఆధ్యాత్మిక ట్రిప్ ముగించుకొని నేడు చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజనీకాంత్ అడుగు పెట్టడమే ఆలస్యం ఇదే ప్రశ్నతో రిపోర్టర్లు తెగ రచ్చ చేశారు. దీంతో రజనీకాంత్ దీనిపై మీడియా ముందు స్పందించారు. "ఎవరైనా నాకంటే చిన్నవారైనా వారు యోగి లేదా స్వామీజీ అయినా వారి కాళ్లపై పడి ఆశీర్వాదం పొందడం నా పద్ధతి" అంటూ తనదైన శైలిలో ఒక్క మాటతో తేల్చేశారు సూపర్ స్టార్. ఇక ఆయన మాటలతో ఆ విమర్శలన్నీ ఒక్కసారిగా పటా పంచలు అయిపోయాయి. ఇక రజిని మాటలు విన్న పలువురు ఫ్యాన్స్ ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, వయసులో చిన్న వాళ్ళయినా పెద్దవాళ్ళైనా స్వామీజీ, యోగులు కనబడితే ఎవరైనా కాళ్ళు మొక్కుతారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దర్శకుడు నెల్సన్ సినిమాలో రజనీకాంత్ ని చూపించిన విధానం, అలాగే సూపర్ స్టార్ యాక్షన్,, స్టైల్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. చాలాకాలం తర్వాత వింటేజ్ రజిని చూసి ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో జైలర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. '2.ఓ', 'పొన్ని యన్ సెల్వన్' సినిమాల తర్వాత రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన మూడో తమిళ చిత్రంగా 'జైలర్' నిలిచింది.

Also Read : చిరు బర్త్ డే స్పెషల్ - ‘తేలు’తో ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్, రీమేక్ కాదుగా అంటున్న ఫ్యాన్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా
హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా
Telugu TV Movies Today: శ్రీరామ నవమి స్పెషల్... ఇవాళ తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే భక్తి సినిమాలు ఇవే, లిస్ట్ ఇదుగో
శ్రీరామ నవమి స్పెషల్... ఇవాళ తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే భక్తి సినిమాలు ఇవే, లిస్ట్ ఇదుగో
Anna Lezneva : మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?
మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Tirupati Crime News: ఆకలితో పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
Iran War: అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
Embed widget