Coolie Second Single: మోనికా మేనియా అదుర్స్ - 'కూలీ' నుంచి బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ వచ్చేసింది
Pooja Hegde Song: రజినీకాంత్ 'కూలీ' మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. బుట్ట బొమ్మ పూజా హెగ్డే తనదైన స్టెప్పులతో స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టారు.

Rajinikanth Coolie Second Single Released: సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబో లేటెస్ట్ అవెయిటెడ్ మూవీ 'కూలీ' నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఇప్పటికే 'చికిటు' సాంగ్ రిలీజ్ కాగా ట్రెండింగ్‌గా మారింది. తాజాగా... బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చారు.
సాంగ్ అదుర్స్
బుట్ట బొమ్మ పూజా హెగ్డే తనదైన జోష్, డ్యాన్స్‌తో అదరగొట్టారు. 'మోనికా బెలూచీ... ఎర్రంగి వందాచీ...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పోర్ట్ ఏరియాలో సాంగ్ పిక్చరైజ్ చేయగా... పూజా హెగ్డేతో మలయాళ నటుడు సౌబిన్ కపూర్ 'మోనికా ఐ లవ్ యూ' అంటూ ఫుల్ ఎనర్జీతో వేసిన స్టెప్పులు వేరే లెవల్‌లో ఉన్నాయి.
Monica, My dear Monica! 😍
— Sun Pictures (@sunpictures) July 11, 2025
The second single #Monica from #Coolie starring @hegdepooja💃🏻 is out now!
▶️ https://t.co/UHACTjGPWg#Coolie worldwide from August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #SoubinShahir @iamSandy_Off #Sublahshini @AsalKolaar @iamnagarjuna… pic.twitter.com/AnM17WjgRL
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... స్పెషల్ సాంగ్‌కు తనదైన గ్రేస్‌తో ఎనర్జీ లెవల్ పెంచేలా రెట్రో స్టైల్‌లో బీజీఎం అందించారు. ఈ పాటకు విష్ణు లిరిక్స్ అందించగా... సుభాషిణి, అనిరుధ్ రవిచందర్ కలిసి ఆలపించారు.
ఆగస్ట్ 14న రిలీజ్
ఈ మూవీలో రజినీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సౌబిన్ కపూర్, సత్యరాజ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటించారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు. ఆగస్ట్ 14న తమిళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీని తెరకెక్కించగా... మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లోకేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో నెగిటివ్ రోల్ సైమన్ రోల్‌లో కనిపించనున్నారు. 'కూలీ నెంబర్ 1421'గా 'దేవా' రోల్‌లో తలైవా మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతుండగా... ఐమాక్స్ ఫార్మాట్‌లోనూ సినిమాను అందుబాటులోకి తెస్తున్నారు.
ఆమిర్ రోల్‌పై ఇంట్రెస్ట్
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేశారు. 'దాహా' రోల్ మాస్ లుక్‌లో ఆమిర్ అదరగొట్టారు. ఆయన డాన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుండగా... విక్రమ్ మూవీ క్లైమాక్స్ 'రోలెక్స్'లానే ఉంటుందని... స్టోరీని ఆయన రోల్ మలుపు తిప్పుతుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.





















