Rajamouli: హీరోగా యాంకర్ సుమా కొడుకు - రోషన్ కనకాలకు రాజమౌళి ఇచ్చిన సలహా ఇదే!
బుల్లితెరపై యాంకర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయిన సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా డెబ్యూ చేయడానికి సిద్ధమయ్యాడు. తనకు రాజమౌళి సపోర్ట్‌గా ముందుకొచ్చాడు.
ఒక కొత్త హీరో సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు అంటే తనకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా లేకపోయినా.. తనను ప్రోత్సహించడానికి ముందుకొచ్చే వారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. భారీ బడ్జెట్ సినిమా అయినా.. తక్కువ బడ్జెట్ సినిమా అయినా రాజమౌళికి నచ్చిందంటే కచ్చితంగా ప్రమోషన్స్ చేయడానికి ముందుకొస్తారు. తాజాగా రాజీవ్ కనకాల, సుమ కనకాలల ముద్దుల కొడుకు రోషన్ హీరోగా నటించిన మొదటి చిత్రం గురించి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు రాజమౌళి. ‘బబుల్ గమ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న రోషన్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
రాజమౌళి చేతుల మీదుగా..
రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కుమారుడు రోషన్.. ఇప్పటికే ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించి తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రోషన్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పరిచయం కానున్నాడు. ఆ సినిమా పేరు ‘బబుల్ గమ్’. మోడల్‌గా బిజీగా తన కెరీర్‌ను గడిపేస్తున్న మానసా చౌదరీ.. ఈ మూవీతో హీరోయిన్‌గా డెబ్యూ చేయనుంది. తాజాగా ‘బబుల్ గమ్’ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారు.
రాజీవ్, సుమలను గర్వపడేలా చేయాలి..
‘నటుడిగా డెబ్యు చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ రోషన్. నీ మర్క్‌ను క్రియేట్ చేసుకుంటావని, రాజీవ్‌ను, సుమగారిని గర్వపడేలా చేస్తావని కోరుకుంటున్నాను. బబుల్ గమ్ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్’ అంటూ రాజమౌళి.. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రాజీవ్ కనకాలతో రాజమౌళి స్నేహం ఈనాటిది కాదు.. రాజమౌళి సీరియల్ దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో అదే సీరియల్‌లో నటుడిగా కనిపించాడు రాజీవ్. అలా రాజమౌళి తెరకెక్కించే ప్రతీ సినిమాలో రాజీవ్ కనకాల ఉంటాడు. ఆ స్నేహంతోనే తన కొడుకు ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
కల నిజమయిన వేళ..
రాజమౌళి.. తన మొదటి సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో రోషన్.. సంతోషంతో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘చాలా థ్యాంక్స్ సార్. మీ ప్రతీ సినిమా నాపై ప్రభావం చూపించి నా కళను మెరుగుపరచుకోవడంలో స్ఫూర్తిగా నిలిచింది. మీరు నా సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం అనేది కల నిజమయినట్టుగా అనిపిస్తోంది. ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అంటూ రోషన్ తన సంతోషాన్ని బయటపెట్టాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ అక్టోబర్ 10న విడుదల కానుందని మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటికే రవికాంత్ పేరేపు తన సినిమాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ‘బబుల్ గమ్’తో కూడా తన సక్సెస్‌ను కొనసాగిస్తాడని మూవీ లవర్స్ అనుకుంటున్నారు.
View this post on Instagram
Also Read: శాస్త్రవేత్తల కృషిని అద్భుతంగా చూపించారు - 'ది వ్యాక్సిన్ వార్' పై మోడీ ప్రశంసలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial