Rashmika Mandanna : దేవ్ మోహన్‌తో కొడైకెనాల్ వెళ్లిన రష్మిక
Rainbow Movie Update : రష్మికా మందన్నా ఇప్పుడు కొడైకెనాల్ లో ఉన్నారు. ఆమెతో పాటు దేవ్ మోహన్ కూడా వెళ్లారు. ఎందుకంటే...
ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఎక్కడ ఉన్నారో తెలుసా? కొడైకెనాల్ (Kodaikanal)లో! ఆమెతో పాటు హ్యాండ్సమ్ హీరో, మలయాళ కథానాయకుడు దేవ్ మోహన్ (Dev Mohan) కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి తమిళనాడులోని హిల్ స్టేషన్ కు ఎందుకు వెళ్లారో తెలుసా? సినిమా షూటింగ్ కోసం!
రష్మిక, దేవ్ మోహన్ జంటగా రూపొందుతోన్న సినిమా 'రెయిన్ బో' (Rainbow Movie). డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శాంతరూబన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... రష్మిక ఫస్ట్ పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది.
తమిళనాడులో 'రెయిన్ బో' షూటింగ్
'రెయిన్ బో' సినిమా ఈ నెల 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైదరాబాదులో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. గ్యాప్ ఏమీ తీసుకోకుండా ఇప్పుడు యూనిట్ కొడైకెనాల్ వెళ్ళింది. తమిళనాడులో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో లుక్ రివీల్ కాకుండా సెట్స్ నుంచి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు రష్మిక.
Also Read : 'హలో మీరా' రివ్యూ : స్క్రీన్ మీద కనిపించేది సింగిల్ క్యారెక్టరే - సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
సమంత నుంచి... రష్మిక దగ్గరకు!
తొలుత 'రెయిన్ బో' సినిమాను సమంత రూత్ ప్రభు (Samantha)తో తీయాలని ప్లాన్ చేశారు. డ్రీమ్ వారియస్ పిక్చర్స్ సంస్థ నుంచి ఆమెతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఏమైందో? ఏమో? సమంత బదులు రష్మికతో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. అన్నట్టు... ఇటీవల విడుదలైన 'శాకుంతలం'లో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించారు. ఇప్పుడు రష్మికతో సినిమా చేస్తున్నారు.
'రెయిన్ బో' ప్రారంభోత్సవంలో నిర్మాత ఎస్.ఆర్. ప్రభును సమంతతో అనుకున్న సినిమా రష్మిక దగ్గరకు ఎలా వచ్చింది? అని ప్రశ్నించగా... ''సినిమా ఇండస్ట్రీలో ఓ మాట ఉంటుంది. కథే ఆర్టిస్టులను వెతుక్కుంటుందని! 'రెయిన్ బో' కథ కూడా ఆ విధంగా రష్మిక దగ్గరకు వెళ్ళింది. మేం ఈ ఫ్లోను డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు'' అని సమాధానం ఇచ్చారు.
Also Read : 'విరూపాక్ష' రివ్యూ : సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?
View this post on Instagram
'రెయిన్ బో' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దీనిని హిందీ సహా ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామని నిర్మాతగా ఎస్.ఆర్. ప్రభు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... ఎం. భాస్కరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు : ఇ. సంగతమిళన్, ప్రొడక్షన్ డిజైనర్ : వినీష్ బంగ్లాన్, కళా దర్శకత్వం : సుబెంథర్ పిఎల్.
రష్మిక చేతిలో భారీ సినిమాలు!
'రెయిన్ బో' కాకుండా రష్మిక చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో నటిస్తున్నారు. అదీ పాన్ ఇండియా సినిమాయే. ఇక, హిందీలో రణబీర్ కపూర్ జోడీగా 'యానిమల్' చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ రెండు కాకుండా ఇటీవల నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు రష్మిక.