Raghava Lawrence: నిన్నేమీ అనను... ఓ సారి వచ్చి నన్ను కలువు - రాఘవ లారెన్స్ ఎమోషనల్... ఎందుకంటే?
Ravi Rathod: 'విక్రమార్కుడు' చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్‌కు రాఘవ లారెన్స్ అండగా నిలిచారు. వైరల్ వీడియోను చూసిన ఆయన... తన గుండె తరుక్కుపోతుందని వచ్చి కలవాలని రిక్వెస్ట్ చేశారు.

Raghava Lawrence Emotional About Ravi Rathod: 'ఏ సత్తి బాల్ లోపటికి వచ్చిందా?' ఈ డైలాగ్ వింటే మనకు ఠక్కున గుర్తొచ్చేది 'విక్రమార్కుడు' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్. ఆ మూవీలో కామెడీ సీన్‌తో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం సినిమా ఛాన్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన స్థితి గురించి చెబుతూ అవకాశాలు లేక సెట్ వర్క్స్ చేసుకుంటున్నట్లు చెప్పాడు.
కొన్నేళ్ల క్రితం పేరెంట్స్ మృతి చెందారని... ప్రస్తుతం స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు రవి. తనను రాఘవ లారెన్స్ దత్తత తీసుకుని స్కూల్‌లో జాయిన్ చేశారని... ఆ అవకాశాన్ని తాను వినియోగించుకోలేదని తెలిపాడు. సెలవుల సమయంలో హాస్టల్ నుంచి పారిపోయానని... ఆ తర్వాత అక్కడికి వెళ్లలేదని చెప్పాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు వెల్లడించాడు. లారెన్స్‌ను మళ్లీ కలిస్తే తనను కొడతారని అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నిన్నేమీ అనను... లారెన్స్ ఎమోషనల్
ఈ వీడియోను చూసిన లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత అతడిని ఇలా చూస్తున్నందుకు నాకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. 'ఈ వీడియో చూసి నా హృదయం తరుక్కుపోతుంది. 'మాస్' సినిమా షూటింగులో తనని కలిశాను. అప్పట్లో ఓ స్కూల్‌లో చేర్పించాను. ఏడాది తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.
అతన్ని కలిసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇన్నేళ్ల తర్వాత ఇలా చూస్తుంటే బాధగా ఉంది. చదువు మధ్యలో మానేసి చెప్పకుండా వెళ్లిపోయినందుకు నేను తిడతానని భయపడుతున్నాడు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నిన్ను తిట్టను, కొట్టను. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నిన్ను చూడాలని ఉంది. నీ కోసం ఎదురు చూస్తుంటా.' అంటూ 'X'లో పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు చెన్నైలోని లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ ఇచ్చారు.
My heart sank watching this video. I met him during the shoot of my Telugu movie Mass. I joined him in school, but after a year, I heard he left and went missing. I tried to find him but couldn’t get any information.
— Raghava Lawrence (@offl_Lawrence) June 28, 2025
Now, seeing him after so many years made me very emotional.… pic.twitter.com/bNcap6gene
Also Read: ప్లీజ్... సాయం చేయాలంటూ రోడ్డుపైనే ఏడ్చేశా - యాక్సిడెంట్ ఘటనపై మలయాళ హీరో 'షైన్ చాకో 'ఎమోషనల్
యాక్టర్, కొరియోగ్రాఫర్‌గానే కాకుండా లారెన్స్ ఎందరికో సాయం అందించి తన మంచి మనసు చాటుకుంటున్నారు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో సాయం అందిస్తున్నారు. చిన్నారులకు ఉచితంగా విద్యతో పాటు వసతి సదుపాయాలు కల్పించి వారి బాగోగులు చూసుకుంటూ అందరి వారికి దేవుడయ్యారు. తాజాగా... రవి రాథోడ్ స్థితిపై స్పందించిన ఆయన ఎమోషనల్ అయ్యారు. దీనిపై నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం లారెన్స్... కాంచన 4, బుల్లెట్, హంటర్, బెంజ్, కాలభైరవ చిత్రాల్లో నటిస్తున్నారు. 'కాంచన 4' చిత్రాన్ని ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.






















