అన్వేషించండి

Gagan Babu: 'పుష్ప' & 'పెద్ది' నుంచి పోలీసుగా... 'జంగా'లో గగన్ బాబు లుక్ చూశారా?

Jangaa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'తో పాన్ ఇండియా హిట్స్ అందుకున్న నటుడు గగన్ బాబు. 'జంగా'లో ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు.

నటుడు గగన్ బాబు (Gagan Babu) పేరు చెబితే ప్రేక్షకులు కొందరు గుర్తు పడతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ 'పుష్ప', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ 'పెద్ది' సినిమాల్లో కనిపించారు. అంతకు ముందు 'ధర్మపురి'లో హీరోగా నటించారు. ఇప్పుడీ నటుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. విలన్ రోల్స్ కాకుండా పోలీస్ రోల్స్ చేస్తున్నారు. కొత్త లుక్కులోకి మారారు. 

వరలక్ష్మి 'జంగా'లో పోలీసుగా గగన్ బాబు
త్రిగుణ్ (అరుణ్ ఆదిత్) హీరోగా రూపొందుతున్న సినిమా 'జంగా'. ఇందులో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రధారి. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు గగన్ బాబు. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమా తనకు కొత్త అవకాశాలు తీసుకు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Idupu Kayitham Controversy Explained - ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gagan Babu (@ursgaganbabu)

ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీమతి వనిత కిలారీ సమర్పణలో 'జంగా' చిత్రాన్ని రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారీ నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్రిగుణ్ పుట్టినరోజుకు మోషన్ పోస్టర్ విడుదల చేసిన టీమ్, ఇప్పుడు గగన్ బాబు పుట్టిన రోజుకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. సుకుమార్ దగ్గరకు వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు గగన్. ఆయనకు సుక్కు ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయ్యింది.

Also Read: Idupu Kayitham Meaning - ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?

'జంగా'లో పోలీస్ ఆఫీసర్‌గా పవరు ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. సీఐ రోహిత్‌ పాత్రలో గగన్ బాబు పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gagan Babu (@ursgaganbabu)

Jangaa Movie Cast And Crew: త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'జంగా'లో మధునందన్, శివ నందన్, నాగ మహేష్, నేహా పఠాన్, శ్రావణ్ రాఘవేంద్ర, భూపాల్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్ సి. దిలీప్, కూర్పు: ప్రవీణ్ పూడి, సంగీతం: కృష్ణ సౌరభ్, సాహిత్యం: కాసర్ల శ్యామ్ - పూర్ణాచారి - కళ్యాణ్ చక్రవర్తి, మాటలు: ప్రసాద్ వర్మ - ప్రేమ్ రాజ్, కళా దర్శకుడు: రఘు కులకర్ణి, ఫైట్స్: కార్తీక్ - వెంకట్, నిర్మాణ సంస్థ: ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ, సమర్ఫణ: శ్రీమతి వనిత కిలారి, నిర్మాతలు: రమ్య కిలారి - జయచంద్ర నాయుడు కిలారి, కథ - కథనం - దర్శకత్వం: కెవిన్ గడ్డం.

Also ReadMaa Inti Bangaram Collections Day 8 - సెకండ్ వీకెండ్ కూడా సమంత కలెక్షన్స్ కుమ్ముడు... బాక్సాఫీస్‌లో బంగారానికి భారీ జంప్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget