అన్వేషించండి

Pushpa 2 Pre Release Event : "పుష్ప 2" ప్రీ రిలీజ్ ఈవెంట్​కు అడ్డంకులు... టెన్షన్​లో ఫ్యాన్స్ - ఉన్నది ఆ ఒక్కటే ఆప్షన్

Pushpa 2 : తెలుగు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం లేనట్టు టాక్ నడుస్తోంది. మరి కారణం ఎంతో తెలుసుకుందాం పదండి.

Pushpa 2 Updates : "పుష్ప 2" మూవీ భారీ హైప్ తో డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ ఇంకా షురూ కాకముందే అడ్డంకి ఏర్పడింది. భారీ ఎత్తున మేకర్స్ జరిపించాలి అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అన్నది అల్లు అర్జున్ అభిమానుల్ని టెన్షన్ పెడుతోంది. ఇక ఇప్పుడు "పుష్ప 2 " మేకర్స్ కు ఉన్నది ఒకటే ఆప్షన్. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎదురైన అడ్డంకి ఏంటి? ఇప్పుడు 'పుష్ప' మేకర్స్ ముందు ఉన్న ఆ ఒక్క ఆప్షన్ ఏంటి? అనే విషయాలను చూద్దాం పదండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "పుష్ప 2". ఈ భారీ మూవీ ఏకంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా సీక్వెల్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక రీసెంట్ గా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందనే అనౌన్స్మెంట్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఈ మూవీ చుట్టూ నెలకొన్న హైప్ చూస్తుంటే సినిమా ఏకంగా 2000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక నిర్మాతలు అయితే సినిమా కచ్చితంగా కలెక్షన్స్ పరంగా బాహుబలిని దాటుతుందని నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ రిలీజ్ కు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లను భారీ ఎత్తున చేయబోతున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

తాజాగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే "పుష్ప 2" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇబ్బందులు తలెత్తబోతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే నవంబర్ 28 దాకా హైదరాబాద్ సిటీలో కర్ఫ్యూ ఉంటుంది. "పుష్ప 2" మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. అంటే ఈ గ్యాప్ లో కర్ఫ్యూ ఉండడం వల్ల సినిమాకు సంబంధించిన భారీ ఎత్తున నిర్వహించాల్సిన ప్రమోషనల్ ఈవెంట్లకు బ్రేకులు పడ్డట్టే. ముఖ్యంగా "పుష్ప 2" మూవీ ప్రీ రిలీజ్ హంగామాకి దాదాపుగా హైదరాబాద్లో ఛాన్స్ లేనట్టే.

నిజానికి ఈ సినిమా అల్లు అర్జున్ కి చాలా స్పెషల్. కాబట్టి ఒకవేళ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్రస్తుతం మేకర్స్ ముందు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆంధ్రా. ఆంధ్రలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాల్సి ఉంటుంది. మరి మేకర్స్ ఈ మూవీ ఈవెంట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించబోతున్నారు అని "పుష్ప 2" మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే గాని ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానుల్లో నెలకొన్న టెన్షన్ తగ్గదు. మరి నిర్మాతల ఫైనల్ కాల్ ఎలా ఉంటుందో చూడాలి. 

Also Readప్రభాస్‌తో పాటు వీళ్లదీ బర్త్ డే... ఇద్దరు హీరోయిన్లు, ఆ నిర్మాత కూడా ఈ రోజే పుట్టారని తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
TDP on Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
TDP on Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
Sandeep Reddy Vanga : 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
TDP on Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
TDP on Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
Sandeep Reddy Vanga : 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
Land Mafia in AP: ఏకంగా సీఎం భూమి కబ్జాకు యత్నం - చంద్రబాబు భూమిని కాజేయాలని ల్యాండ్ మాఫియా ప్లాన్
ఏకంగా సీఎం భూమి కబ్జాకు యత్నం - చంద్రబాబు భూమిని కాజేయాలని ల్యాండ్ మాఫియా ప్లాన్
ISROs 100th Mission: ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
Allu Arjun : 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కి అల్లు అర్జున్ డుమ్మా... కారణం ఏంటో తెలుసా?
'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కి అల్లు అర్జున్ డుమ్మా... కారణం ఏంటో తెలుసా?
Viral News: నర్సీపట్నంలో కత్తితో తిరుగుతూ యువతి హల్‌చల్, ఆమె మాటలు విని అంతా షాక్!
నర్సీపట్నంలో కత్తితో తిరుగుతూ యువతి హల్‌చల్, ఆమె మాటలు విని అంతా షాక్!
Embed widget