అన్వేషించండి

Kriti Kharbanda: ప్రియుడితో ‘బోణీ’ బ్యూటీ నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

‘బోణీ’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన నటి కృతి కర్బంద త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతోంది. తన ప్రియుడు పులకిత్‌ సామ్రాట్‌ తో మెడలో మూడు ముళ్లు వేయించుకోబోతోంది.

Kriti Kharbanda's Beach Wedding Card Goes Vral: ‘బోణి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. తొలి సినిమాతోనే అందం, అభినయంతో అలరించింది. ‘తీన్‌మార్‌’ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఒంగోలు గిత్త’,  ‘మిస్టర్ నూకయ్య’, ‘బ్రూస్లీ’ లాంటి సినిమాలు చేసింది. అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో సౌత్ నుంచి నార్త్ బాట పట్టింది. అక్కడ అడపాదడపా వెండితెరపై కనిపిస్తుంది.  

రీసెంట్ గా కృతి-పులకిత్ నిశ్చితార్థం

పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది కృతి కర్బంద. తన బాయ్ ఫ్రెండ్ తో సంసార జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్ తో కొంతకాలంగా ఈమె ప్రేమాయణం నడుపుతోంది. రీసెంట్ గా వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబ సభ్యులు కొద్ది మంది మిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు టాక్ వినిపించింది. అయితే, కృతి కర్బంద, పులకిత్ ఈ వార్తలపై ఎలాంటి కామెంట్ చేయలేదు. తాజాగా ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న వీళ్లిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. అందుతో ఇద్దరి చేతికి ఒకే రకమైన రింగ్స్ ఉండటంతో ఆ వార్తలు నిజమేననే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సదరు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.    

గత 6 సంవత్సరాలుగా ప్రేమాయణం

నిజానికి గత 6 సంవత్సరాలుగా పులకిత్ తో కృతి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా తన ప్రేమ గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటూ వస్తోంది. అవకాశం ఉన్నప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా సోషల్ పులకిత్ ను  పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఈ  మేరకు ఓ ఇన్ స్టా రీల్ పెట్టింది. మార్చి 13న వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్నట్లు వెల్లడించింది. పెళ్లి కార్డు లాంటి ఫోటోను కూడా షేర్ చేసిన కృతి. ఇందులో పెళ్లి ఎక్కడ అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే, ఢిల్లీలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

పులకిత్ కు ఇది రెండో పెళ్లి!

‘బిట్టూ బాస్‌’, ‘సనమ్‌ రే’, ‘ఫక్రీ’ సిరీస్‌ చిత్రాలతో మెప్పించారు పులకిత్‌. 2015లో వచ్చిన ‘బ్రూస్‌ లీ’ తర్వాత కృతి టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్‌ లో పలు సినిమాలు చేశారు. వీరిద్దరు కలిసి ‘పాగల్‌ పంతీ’, ‘తైశ్‌’ తో పాటు మరికొన్ని సినిమాలు చేశారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.  పులకిత్ కు ఇది రెండో పెళ్లి. గతంలో అతడు శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరి పెళ్లి జరిగింది. కొన్ని గొడవల కారణంగా కేవలం ఏడాదిలోగా విడాకులు తీసుకున్నారు.  ఆ తర్వాత యామీ గౌతమ్ తో కొంత కాలం ప్రేమాయణం నడిపాడు పులకిత్. కొన్ని కారణాలతో వీరిద్దరు బ్రేకప్ అయ్యారు. ఇక 2019 నుంచి   కృతి కర్బందతో లవ్ లో ఉన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

Read Also: కమల్ ‘గుణ’ పాటకు భలే క్రేజ్ - ‘తమిళనాట ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలనం, ఇంతకీ ఆ సాంగ్‌కు.. సినిమాకు లింకేమిటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget