Producer Shirish: రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్‌కు సారీ - తన కామెంట్స్‌పై ప్రొడ్యూసర్ శిరీష్ వివరణ... కాంట్రవర్సీకి చెక్ పడినట్లేనా?
Game Changer Controversy: ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ వివాదం హాట్ టాపిక్‌గా మారిన వేళ ప్రొడ్యూసర్ శిరీష్ మెగా ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

Producer Shirish Official Statement About Game Changer Movie Controversy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీపై కామెంట్స్ కాంట్రవర్శీ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ ఓ అపాలజీ లెటర్ రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ శిరీష్. తాజాగా సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
మెగా ఫ్యాన్స్‌కు సారీ
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు తమ ఎస్వీసీ సంస్థతో ఎంతో అనుబంధం ఉందని శిరీష్ అన్నారు. ఆయన్ను ఎప్పుడూ కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. 'చరణ్ గారికి నాకు మధ్య మంచి రిలేషన్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో ఆయన ఒకరు. ఆయన్ను అవమానించడం, కించపరచడం నా జన్మలో ఎప్పుడూ చేయను. నా ఇంటర్వ్యూలో ఆయన గురించి పొరపాటుగా ఓ మాట దొర్లినా నా తప్పే. అలా జరిగిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు కనుక మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. చరణ్ గారికి కూడా సారీ చెబుతున్నా.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025
ఫ్యాన్స్ ఆగ్రహం, ట్రోలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. కానీ నేను అన్న ఇంటెన్షన్ అది కాదు. మాకున్న రిలేషన్, క్లోజ్ నెస్ బట్టి ఓ మాట దొర్లాను తప్ప ఆయన్ను అవమానించాలని కాదు. మెగా హీరోలతో అందరితోనూ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్లను అవమానించేంత మూర్ఖున్ని కాదు. దయచేసి అభిమానులు అంతా అర్థం చేసుకోవాలి. చరణ్ ఒప్పుకోకుంటే 'గేమ్ ఛేంజర్'తో పాటు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రిలీజ్ అయ్యేది కాదు. రెండు సినిమాలు రిలీజ్ చేసుకోవాలని గొప్ప మనసుతో రామ్ చరణ్ అంగీకరించారు. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధ పడితే క్షమాపణ చెబుతున్నా. దయచేసి మా రిలేషన్ పాడు చెయ్యొద్దు. నెక్స్ట్ చరణ్ గారితో ఓ సినిమా తీయబోతున్నాం.' అని శిరీష్ వివరణ ఇచ్చారు.
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ - 'వార్ 2' కోసం డిఫరెంట్ ప్రమోషన్ వార్... క్రేజ్ అలాంటిది మరి
అసలేం జరిగిందంటే?
నితిన్ 'తమ్ముడు' రిలీజ్ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పై కామెంట్స్ చేశారు. 'సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో ఏమైనా హెల్ప్ చేశారా? డైరెక్టర్ చేశారా కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు.' అంటూ కామెంట్స్ చేయగా మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' (SVC) ను బ్యాన్స్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
దీంతో దిల్ రాజు సైతం వివరణ ఇచ్చారు. అయినా అభిమానులు వెనక్కు తగ్గలేదు. తాజాగా... శిరీష్ దిగి వచ్చి స్వయంగా ఓ లెటర్ రిలీజ్ చేశారు. తన సినిమా కోసం రామ్ చరణ్ పూర్తి సహకారం అందించారని... నా కామెంట్స్ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని రాసుకొచ్చారు. తాజాగా ఓ వీడియోలోనూ వివరణ ఇచ్చారు. ఇకనైనా ఈ వివాదానికి చెక్ పడుతుందేమో చూడాల్సి ఉంది.






















