అన్వేషించండి

Bunny Vasu: 'ఆయ్‌'మూవీ సక్సెస్‌ మీట్‌లో నిర్మాత బన్నీ వాసు కీలక అప్‌డేట్..!

Bunny Vasu: చిన్న సినిమాగా వచ్చిన ఆయ్‌ మూవీకి ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. పెద్ద సినిమాలతో పోటీకి దిగిన ఈ చిత్రం మౌత్‌ టాక్‌తోనే మంచి విజయం అందుకుంది. దీంతో మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది టీం.

Bunny Vasu Comments at AAY Success Meet: జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిని, నయన్ సారికలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఆయ్‌'. అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మించారు. ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్ షో నుంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మౌత్‌ టాక్‌తో సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని థియేటర్లను పంచుకుంది స్వాతంత్ర్య దినొత్సవం సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

దీంతో మూవీ టీం ఆయ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయ్‌ డైరెక్టర్‌ అంజీతోనే తమ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన ఆయ్‌ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ...  " 'ఆయ్‌' సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే ఈ చిత్రం ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఆడియెన్స్ ఎంతగా ఆదరిస్తారో 'ఆయ్' మూవీ మరోసారి నిరూపించింది. మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది.

ఈ సినిమా దాదాపు రూ. 11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.  మౌత్ టాక్‌తోనే మంచి విజయం సాధించింది. ఈ సినిమా 110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్టుగా నిలిచిన టీంకు, SKNకు థాంక్యూ. హీరో నితిన్ లక్కీ స్టార్ అని చెప్పాలి. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. కథ చెప్పగానే వెంటనే ఓకే చేశారు. కథల మీద నితిన్‌కి మంచి జడ్జ్మెంట్ ఉంది.

భవిష్యత్తులోనూ ఆయనకు ఫ్లాప్ సినిమా రాదని అనిపిస్తోంది.  ఇక మా డీఓపీ సమీర్‌ని చాలా కష్టపెట్టాం. ఎండాకాలంలో సినిమా తీసినా.. వర్షకాలంలో సినిమా తీసినట్టుగా ఉండాలని ఆయన ఇబ్బంది పెట్టాం. మేం ఏం ఆశించామో దాని కంటే గొప్పగా ఆయ విజవల్స్‌ వచ్చాయి. రామ్ మిర్యాల, అజయ్‌లు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. డైరెక్టర్‌ అంజి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. అంజి మన మూలాల్ని మర్చిపోలేదు. అందుకే అద్భుతమైన సినిమాను తీశాడు. మళ్లీ మా బ్యానర్‌లోనే అంజి సినిమా చేస్తున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చారు. 

హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ.. "పెద్ద సినిమాల మధ్యలో మా 'ఆయ్' సినిమా వచ్చింది. మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థ్యాంక్యూ. అంజి గారు మంచి కథను నాకు ఇచ్చారు. నాకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ అంజీకి థ్యాంక్యూ. డీవోపీ సమీర్ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సూఫీయానా సాంగ్ గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. బన్నీ వాస్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారు, విద్యా గారికి ధన్యవాదాలు" అని పేర్కొన్నాడు. 

Also Read: ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్‌ - త్వరలోనే సెట్లోకి తిరిగి వస్తానంటూ ట్వీట్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Safest Cars: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget