అన్వేషించండి

Darling Release Date: 'డార్లింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్ - ప్రియదర్శి, నభా నటేష్‌ల సినిమా ఎప్పుడంటే?

Darling Release Date: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Darling Release Date: ప్రియదర్శి పులికొండ, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. 'వై దిస్ కొలవెరి' అనేది దీనికి ట్యాగ్‌ లైన్. తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. హను-మాన్ ప్రొడ్యూసర్ కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ఖరారు చేసారు. 2024 జులై 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

'డార్లింగ్' సినిమా విడుదల తేదీని హీరో ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. "నా డార్లింగ్స్ అందరూ జూలై 19న వరల్డ్ వైడ్ గా రిలీజయ్యే హృద్యమైన మ్యాడ్‌ మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్ కోసం సిద్ధంగా ఉండండి! ఇది బిగ్ స్క్రీన్ మీద ప్రేమ, నవ్వు, జీవితం యొక్క అద్భుతమైన సమ్మేళనంగా ఉండబోతోంది" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నభా నటేష్ వివిధ భంగిమల్లో ఫోజులు ఇవ్వగా.. ప్రియదర్శి ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో ఈఫిల్ టవర్ ను మనం గమనించవచ్చు.

నేటి తరం యువతీ యువకులకి కనెక్ట్ అయ్యే పెళ్లి క‌ష్టాల‌ నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా 'డార్లింగ్' సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడు తన భార్య‌ కార‌ణంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా గడిపిన జంట, పెళ్ళి తర్వాత ఎందుకు గొడవలు పడతారు? భార్యా భర్తల మధ్య గిల్లికజ్జాలు, వాటి పర్యవసానం ఏంటి? వంటి అంశాలతో ఈ మూవీని రూపొందించినట్లు సమాచారం.

'డార్లింగ్' చిత్రంలో చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. నరేష్ డీఓపీగా, ప్రదీప్ రాఘవ్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాను. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగేళ్ళతో పాటుగా మురళీధర్ గౌడ్, శివా రెడ్డి, కృష్ణ తేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి.. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా, కథానాయకుడిగా బిజీగా మారిపోయాడు. 'బలగం' మూవీతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవల 'ఓం భీమ్ బుష్' మూవీలో కీలక పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హార‌ర్ కామెడీ మూవీ చేస్తూనే, మరోవైపు 'డార్లింగ్' అంటూ రాబోతున్నాడు. 

ఇది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కు కంబ్యాక్ మూవీ. ఆమె చివరగా 2021 ప్రారంభంలో 'అల్లుడు అదుర్స్' సినిమాలో కనిపించింది. ఓ యాక్సిడెంట్ కార‌ణంగా సినిమాలకు దూరమైన ఈ భామ.. మూడున్న‌రేళ్ల గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు ప్రియదర్శితో కలిసి 'డార్లింగ్' మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి బయటకి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Also Read: చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త - ఉద్యోగుల తొలగింపు, అమ్మకానికి ఆఫీస్.. అసలు ఏమైంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Embed widget